AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jawan OTT: షారుక్ బర్త్ డే ట్రీట్ వచ్చేసింది. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి జవాన్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా, సౌతిండియన్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన సినిమా జవాన్‌. కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. విజయ్‌ సేతుపతి విలన్‌గా మెరవగా, దీపికా పదుకొణె మరో కీలక పాత్రలో నటించింది.సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జవాన్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద రికార్డులతో పాటు వసూళ్ల వర్షం కురిపించింది.

Jawan OTT: షారుక్ బర్త్ డే ట్రీట్ వచ్చేసింది. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి జవాన్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Shah Rukh Khan Jawan Movie
Basha Shek
|

Updated on: Nov 01, 2023 | 1:41 PM

Share

బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా, సౌతిండియన్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన సినిమా జవాన్‌. కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. విజయ్‌ సేతుపతి విలన్‌గా మెరవగా, దీపికా పదుకొణె మరో కీలక పాత్రలో నటించింది.సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జవాన్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద రికార్డులతో పాటు వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.1100 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. షారుక్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, నయన్‌, దీపికల నటన, విజయ్‌ సేతుపతి విలనిజం జవాన్‌ సినిమా సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించాయి. థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన జవాన్‌ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. షారుక్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని గురువారం (నవంబర్‌ 2)న ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్ షారుక్‌ సినిమా డిజిటల్‌ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నుంచే జవాన్‌ సినిమాను అందుబాటులోకి తీసుకురానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో షారుక్‌ మూవీని స్ట్రీమింగ్‌కు రానుంది.

అదనపు సన్నివేశాలతో కలిపి స్ట్రీమింగ్‌..

జవాన్‌ ఓటీటీ రిలీజ్‌ సందర్భంగా ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. థియేటర్‌లో రన్‌ టైమ్‌ సమస్య తలెత్తకుండా కత్తిరించిన అదనపు సన్నివేశాలను కూడా ఓటీటీ వెర్షన్‌లో జోడిస్తున్నారు. థియేటర్‌ లో జవాన్‌ సినిమా 169 నిమిషాల పాటు రన్‌ టైమ్‌ ఉంటే, ఓటీటీలో ఆ సమయం ఇంకాస్త పెరగనుంది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై షారుక్‌ ఖాన్‌ సతీమణి గౌరీఖాన్‌ జవాన్‌ సినిమాను నిర్మించారు. ప్రియమణి, విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన పాటలు చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి. మరి థియేటర్లలో జవాన్ సినిమాను మిస్‌ అయ్యారా? అయితే మరికొన్ని గంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎంచెక్కా చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి