- Telugu News Photo Gallery Cinema photos Aata Sandeep reveals his Bigg Boss 7 Telugu Top 3 contestants after elimination
Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ 7 టాప్-3లో ఉండేది వారే.. సందీప్ మాస్టర్ అసలు విషయం చెప్పేశాడుగా..
బిగ్ బాస్ ఏడో సీజన్ ఎనిమిదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ సందీప్ మాస్టర్ హౌజ్‌ను వీడాడు. బిగ్ బాస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా హౌజ్ లోకి అడుగుపెట్టిన అతను అనూహ్యంగా ఎలిమినేట్ అవ్వడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. సుమారు రెండు నెలల పాటు సందీప్ మాస్టర్ హౌజ్‌లో ఉన్నారు.
Updated on: Oct 31, 2023 | 2:10 PM

బిగ్ బాస్ ఏడో సీజన్ ఎనిమిదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ సందీప్ మాస్టర్ హౌజ్‌ను వీడాడు. బిగ్ బాస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా హౌజ్ లోకి అడుగుపెట్టిన అతను అనూహ్యంగా ఎలిమినేట్ అవ్వడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. సుమారు రెండు నెలల పాటు సందీప్ మాస్టర్ హౌజ్‌లో ఉన్నారు.

కాగా బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన సందీప్ మాస్టర్ తన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అలాగే హౌజ్‌లోని కంటెస్టెంట్లపై తన అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.

3. ఆటపరంగా బిగ్‌బాస్ హౌజ్‌లో భోలే షావలి, రతిక రోజ్‌లు తనకన్నా తక్కువగానే ఆడతారని సందీప్ మాస్టర్ చెప్పుకొచ్చారు. 'ఇప్పటికీ హౌస్‌లో నా కన్నా తక్కువగా ఆడుతున్న వాళ్లు ఉన్నారు. రతిక రోజ్, భోలే షావలి ఆడిందేమీ లేదు. ఒకరకంగా చెప్పాలంటే నా కన్నా ముందే భోలే వెళ్లవచ్చని అనుకున్నా' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మాస్టర్.

'బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నన్నీ రోజులు నా ఆటను నేను ఒంటరిగానే ఆడాను. అయితే ఒక గ్రూప్ అంటూ మమ్మల్ని వేరు చేయటం ఏ మాత్రం సరికాదు' అంటూ పేర్కొన్నారు.

అలాగే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, అమర్‌దీప్‌లు బాగా ఆడుతున్నారని.. వారు టాప్-3లో ఉంటారని సందీప్ మాస్టర్ తెలిపారు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.