- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun, Ram Charan special attraction in Varun Tej and Lavanya Tripathi wedding celebration cocktail party photos
Varun Tej- Lavanya Tripathi: వరుణ్, లావణ్య కాక్ టైల్ పార్టీ.. సందడి చేసిన రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఫొటోస్
టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి వేడుకలు గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా సోమవారం (అక్టోబర్ 30) రాత్రి కాక్ టైల్ పార్టీ ఘనంగా జరిగింది. వరుణ్, లావణ్యలతో పాటు రామ్ చరణ్- ఉపాసన దంపతులు, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, లావణ్య కుటుంబ సభ్యులు ఈ పార్టీలో సందడి చేశారు.
Updated on: Oct 31, 2023 | 11:44 AM

టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి వేడుకలు గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా సోమవారం (అక్టోబర్ 30) రాత్రి కాక్ టైల్ పార్టీ ఘనంగా జరిగింది. వరుణ్, లావణ్యలతో పాటు రామ్ చరణ్- ఉపాసన దంపతులు, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, చిరంజీవి సతీమణి సురేఖ, లావణ్య కుటుంబ సభ్యులు ఈ పార్టీలో సందడి చేశారు.

ఈ సందర్భంగా కాబోయే దంపతులు వరుణ్ తేజ్, లావణ్యలు తెలుపు రంగు దుస్తుల్లో ముస్తాబయ్యారు. అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఇతరులు స్టైలిష్ డ్రెస్సులు ధరించి వేడుకల్లో భాగమయ్యారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్యల త్రిపాఠీ కాక్ టైల్ పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మెగా అభిమానులు ఈ ఫొటోలను షేర్ చేస్తూ #varnlav హ్యాష్ ట్యాగ్‌ను బాగా ట్రెండ్ చేస్తున్నారు.

ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మంగళవారం (అక్టోబర్ 31)న హల్దీ, మెహెందీ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల కోసం హాజరయ్యే అతిథుల కోసం స్పెషల్ డ్రెస్ కోడ్ కూడా ఉందట.

ఇక బుధవారం (నవంబర్ 1) మధ్యాహ్నం సరిగ్గా 2.48 గంటలకు వరుణ్, లావణ్యల పెళ్లి వేడుక జరగనుంది. మెగా, అల్లు కుటుంబీకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.





























