- Telugu News Photo Gallery Cinema photos Keedaa Cola to Ambajipeta Marriage Band latest movie updates from tollywood
Movie Upates: కీడా కోలా ప్రీ రిలీజ్ వేడుక విశేషాలు.. సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ సాంగ్..
తరుణ్ భాస్కర్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా క్రీడా కోలా. సాయి రాజేష్ దర్శకత్వంలో SKN నిర్మాణంలో రూపొందిన 'బేబీ' ఎలాంటి ఫలితం అందుకుందో చెప్పనక్కర్లేదు. శ్రీరామ్, ఖుషీ రవి, ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో సాయికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పిండం. కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్‌కే దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఉపేంద్ర గాడి అడ్డా.
Updated on: Oct 31, 2023 | 12:01 PM

తరుణ్ భాస్కర్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా క్రీడా కోలా. నవంబర్ 3న సినిమా విడుదల కానుంది. అక్టోబర్ 29న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీనికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చారు. తరుణ్ తెరకెక్కించిన పెళ్లిచూపులు సినిమాతోనే విజయ్ దేవరకొండ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటినుంచి ఇద్దరు స్నేహం కొనసాగుతూనే ఉంది.

సాయి రాజేష్ దర్శకత్వంలో SKN నిర్మాణంలో రూపొందిన 'బేబీ' ఎలాంటి ఫలితం అందుకుందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యను హీరోయిన్‌గా పరిచయం చేసిన మేకర్స్.. ఇప్పుడు యూ ట్యూబరల్ అలేఖ్య హారికను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛ్ చేసారు.

శ్రీరామ్, ఖుషీ రవి, ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో సాయికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పిండం. కాలాహి మీడియా బ్యానర్‌లో యశ్వంత్ దగ్గుమాటి సినిమాను నిర్మిస్తున్నారు. నవంబర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. తాజాగా టీజర్ విడుదలైంది. ఓ మారుమూల ఇల్లు, అందులో ఓ కుటుంబం, వాళ్లను భయపెట్టే ఆత్మ.. దీని చుట్టే కథ తిరిగినట్లు అర్థమవుతుంది.

కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. దుశ్యంత్ కటికినేని ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాట గుమ్మా అంటూ సాగే లిరికల్ విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుందంటూ సంతోషం వ్యక్తం చేసారు దర్శక నిర్మాతలు.

కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్‌కే దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఉపేంద్ర గాడి అడ్డా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీనికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.




