AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేదం, మిరపకాయ్ సినిమాల్లో నటించిన దీక్షా సేత్ గుర్తుందా! ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

సినిమా ప్రపంచంలోకి కొందరు ప్లాన్ చేసుకుని వస్తే, మరికొందరు అనుకోకుండా వచ్చి మెరిసిపోతుంటారు. అలా ఒక యాదృచ్ఛిక ఘటన వల్ల వెండితెరపై మెరిసి, అనతి కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్న నటి ఆమె. స్టార్ డమ్ సొంతం చేసుకుని తర్వాత మరో ఇండస్ట్రీలో కూడా సక్సెస్‌ఫుల్ కెరీర్ అందుకుంది.

వేదం, మిరపకాయ్ సినిమాల్లో నటించిన దీక్షా సేత్ గుర్తుందా! ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
Deeksha Seth
Nikhil
|

Updated on: Mar 03, 2026 | 9:53 PM

Share

పుట్టింది ఢిల్లీలో అయినా, పెరిగింది మాత్రం భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో. ఒకప్పుడు ‘వేదం’ వంటి సినిమాలతో యూత్ కలల రాజకుమారిగా వెలిగిన ఆ సుందరి ప్రయాణం ఇప్పుడు ఒక కొత్త మలుపు తీసుకుంది. ఆమె ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోయిన్. ‘స్టైలిష్ స్టార్’ సరసన ఒక వినూత్నమైన పాత్రలో కనిపించి మెప్పించింది. సముద్ర గర్భంలో దాగి ఉన్న ప్రాచీన ఓడల శకలాలను, చరిత్రను వెలికితీసే ‘మెరైన్ ఆర్కియాలజిస్ట్’ అవ్వాలని కలలు కనింది. కానీ విధి మరోలా తలచింది. ఒక కాలేజ్ ఈవెంట్ లో ఆమెను చూసిన ఒక స్కౌట్, ఆమె జీవిత గమనాన్నే మార్చేశారు. అలా వెండితెరపై ‘పూజ’గా మన ముందుకు వచ్చిన ఆ అందాల నటి మరెవరో కాదు.. దీక్షా సేత్.

1990 ఫిబ్రవరి 14న ఢిల్లీలో జన్మించిన దీక్షా సేత్ బాల్యం అంతా ప్రయాణాలతోనే గడిచింది. ఆమె తండ్రి ఐటీసీ లిమిటెడ్ లో పనిచేయడం వల్ల ఆయనకు తరచుగా బదిలీలు అయ్యేవి. ఫలితంగా ముంబై, చెన్నై, కోల్‌కతా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఇలా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఆమె నివసించింది. కేవలం ఇండియాలోనే కాదు, కొన్నాళ్లు నేపాల్‌లోని ఖాట్మండులో కూడా ఉంది. ఈ భిన్నమైన వాతావరణాల్లో పెరగడం వల్ల ఆమెకు విభిన్న సంస్కృతులపై అవగాహన పెరిగింది.

అనుకోకుండా సినిమాల్లోకి..

ముంబైలో కాలేజీలో చదువుతున్నప్పుడు దీక్షాకు సినిమాలపై అస్సలు ధ్యాస ఉండేది కాదు. ఆమె లక్ష్యం మెరైన్ ఆర్కియాలజీ. కానీ 2009లో ఒక ఎన్ఎస్ఎస్ (NSS) ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు ఆమెను ఫెమినా మిస్ ఇండియా టాలెంట్ స్కౌట్ గుర్తించారు. వారి ప్రోత్సాహంతోనే మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఎలాంటి ముందస్తు అనుభవం లేకపోయినా, మిస్ ఇండియా పోటీల్లో టాప్-10 ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచి ‘ఫ్రెష్ ఫేస్’ గుర్తింపు పొందింది. ఆ గుర్తింపు ఆమెకు ‘వేదం’లో అవకాశం వచ్చేలా చేసింది.

బిజినెస్ లోకి..

‘వేదం’ తర్వాత రవితేజ సరసన ‘మిరపకాయ్’, ప్రభాస్ తో ‘రెబెల్’, గోపీచంద్ తో ‘వాంటెడ్’ వంటి సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో కూడా ఒక ప్రయత్నం చేసింది. అయితే, సినీ పరిశ్రమలో కొన్నాళ్లు మెరిసిన తర్వాత ఆమె తన కెరీర్ బాట మార్చుకుంది. గ్లామర్ ప్రపంచానికి దూరంగా వెళ్లి వ్యాపార రంగంలో అడుగుపెట్టింది. ప్రస్తుతం దీక్షా సేత్ యూకేకు చెందిన ఒక ప్రముఖ గేమింగ్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ బిజినెస్ రంగంలో రాణిస్తోంది. ఒకప్పుడు కెమెరా ముందు గ్లామర్ వలకబోసిన దీక్షా సేత్, ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో తన సత్తా చాటుతోంది. అనుకోకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూనే, తనకిష్టమైన మరో రంగంలో స్థిరపడటం విశేషం.

Follow Us
సనత్ నగర్ టిమ్స్‌పై మరో అప్డేట్.. నిమ్స్ తరహాలోనే ఛార్జీల ఉంటాయా?
సనత్ నగర్ టిమ్స్‌పై మరో అప్డేట్.. నిమ్స్ తరహాలోనే ఛార్జీల ఉంటాయా?
రూ.20 విషయంలో కేసు.. 30 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
రూ.20 విషయంలో కేసు.. 30 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
ఆ తండ్రి కల నెరవేర్చనున్న 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌
ఆ తండ్రి కల నెరవేర్చనున్న 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌
ఈడీ విచారణలో మొత్తం బయటపెట్టిన నిధి అగర్వాల్
ఈడీ విచారణలో మొత్తం బయటపెట్టిన నిధి అగర్వాల్
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇదే..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇదే..
ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?
ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?
అద్భుతమైన ఫీచర్​ తెచ్చేసిన వాట్సాప్​.. ఏంటది
అద్భుతమైన ఫీచర్​ తెచ్చేసిన వాట్సాప్​.. ఏంటది
కేవలం 35 రూపాయలకే 153 కిలోమీటర్లు.. మైండ్‌ బ్లోయింగ్‌ స్కూటర్‌
కేవలం 35 రూపాయలకే 153 కిలోమీటర్లు.. మైండ్‌ బ్లోయింగ్‌ స్కూటర్‌
ఒక్కసారిగా బావిలోకి దూసుకెళ్లిన కారు.. కుటుంబం మొత్తం బలి!
ఒక్కసారిగా బావిలోకి దూసుకెళ్లిన కారు.. కుటుంబం మొత్తం బలి!
గోవా నుంచి ఫ్లైట్‌లో ఎంత మద్యం తీసుకరావొచ్చు..? ఎక్కువ తెస్తే ఏమవ
గోవా నుంచి ఫ్లైట్‌లో ఎంత మద్యం తీసుకరావొచ్చు..? ఎక్కువ తెస్తే ఏమవ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర