Mrunal Thakur: అల్లు అరవింద్ ఆశీర్వాదం.. మృణాల్ ఠాకూర్ కూడా హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి పెళ్లి రేపు అంటే నవంబర్ 1న ఇటలీలో వీరి వివాహం గ్రాండ్ గా జరగనుంది. ఈ ఇద్దరు మిస్టర్ అనే సినిమాలో కలిసి నటించారు అప్పటి నుంచి ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు. తాజాగా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటున్నారు. అయితే వీరి వివాహానికి అరవింద్ కూడా పరోక్షంగా కారణం అయ్యారు.
ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో పెళ్లి సందడి కనిపిస్తుంది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలి ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి పెళ్లి రేపు అంటే నవంబర్ 1న ఇటలీలో వీరి వివాహం గ్రాండ్ గా జరగనుంది. ఈ ఇద్దరు మిస్టర్ అనే సినిమాలో కలిసి నటించారు అప్పటి నుంచి ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు. తాజాగా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటున్నారు. అయితే వీరి వివాహానికి అరవింద్ కూడా పరోక్షంగా కారణం అయ్యారు. అదెలా అంటే ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లావణ్య త్రిపాఠి పై ప్రశంసలు కురిపిస్తూనే మంచి తెలుగబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో సెటిల్ అయ్యిపో అని సరదాగా అన్నారు అరవిద్. ఇప్పుడు నిజంగానే లావణ్య తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది.
అది కూడా మెగా ఫ్యామిలీ అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది. అరవింద్. వరుణ్ తేజ్, లావణ్య పెళ్ళికి అరవింద్ ఆశీర్వాదం కూడా తోడైందని అంటున్నారు కొందరు. ఇక ఇప్పుడు మరోహీరోయిన్ కు కూడా ఇదే ఆశీర్వాదం ఇచ్చారు అల్లు అరవింద్. మృణాల్ ఠాకూర్ ను కూడా ఆశీర్వదించారు అల్లు అరవింద్.
తాజాగా సైమా అవార్డు లో సీతారామం సినిమాకు గాను అవార్డు అందుకుంది మృణాల్ ఠాకూర్. ఆ అవార్డును అల్లు అరవింద్ మృణాల్ కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఓ వేదిక పై నేను ఓ హీరోయిన్ ను ఆశీర్వదించారు.. హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకోమన్నాను. ఆమె నా మాటను నిజం చేసింది. ఇప్పుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తున్న.. హైదరాబాద్ కు వచ్చేయ్ అని అన్నారు. దాంతో మృణాల్ కూడా హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
#alluaravind mawa very naughty aa… #MrunalThakur tfi lo young heroni chesesko… pic.twitter.com/kjeCzguXQM
— celluloidpanda (@celluloidpanda) October 28, 2023
మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..