Varun Tej- Lavanya Tripathi: వరుణ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ..పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?
ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా సోమవారం (అక్టోబర్ 30) రాత్రి కాక్ టెయిల్ పార్టీ ఘనంగా జరిగింది. కాబోయే దంపతులు వరుణ్, లావణ్యలతో పాటు మగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య త్రిపాఠీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇటలీలోని టుస్కానీ వేదికగా జరుగుతున్న ఈ డెస్టి నేషన్ వెడ్డింగ్‌కు ఇప్పటికే ఏర్పాట్లు గ్రాండ్‌గా పూర్తయ్యాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా సోమవారం (అక్టోబర్ 30) రాత్రి కాక్ టెయిల్ పార్టీ ఘనంగా జరిగింది. కాబోయే దంపతులు వరుణ్, లావణ్యలతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య త్రిపాఠీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్నారు. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఇందులో కాబోయే దంపతులు వరుణ్ తేజ్, లావణ్యలు తెలుపు రంగు దుస్తుల్లో తళుక్కుమన్నారు. అలాగే రామ్ చరణ్, ఉపాసన దంపతులు వైట్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో ముస్తాబు చేశారు. ఇక అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ బ్లాక్ కలర్ సూట్‌లో స్టైలిష్‌గా కనిపించారు. ప్రస్తుతం వరుణ్, లావణ్యల కాక్ టెయిల్ పార్టీకి సంబంధించిన పెళ్లి ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మెగా అభిమానులు వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో #VarunLav హ్యాష్‌ట్యాగ్‌ను ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది.
కాగా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా మంగళవారం (అక్టోబర్ 31) ఉదయం 11 గంటల నుంచి వరుణ్ తేజ్, లావణ్యల హల్డీ వేడుక జరగనుంది. దీంతో పాటు ఒక స్పెషల్ థీమ్ తో పూల్ పార్టీ కూడా జరగనుంది. ఈ వేడుకలో అందరూ ఎల్లో, వైట్, పింక్ కలర్ దుస్తులు ధరించనున్నారు. ఇక హల్దీ వేడుక కోసం లావణ్య కు ఓ స్పెషల్ లెహంగా డిజైన్ చేయించారు. లావణ్యా త్రిపాఠి తల్లి చీరతో ఈ లెహంగా తయారైంది. పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుక ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఈ డ్రెస్‌ను డిజైన్ చేశారు. ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావు ఈ లెహెంగాను డిజైన్ చేశారు. ఇక హల్దీ వేడుక పూర్తి అయిన తర్వాత సాయంత్రం ఐదున్నరకు మెహందీ వేడుకలు మొదలవుతాయి.
హల్దీ, మెహెందీ టైమింగ్స్ ఇవే..
The Grand Mega Wedding rituals start today for a row of 3 days in ITALY😍✨🎉
30th Oct: Cocktails 31st Oct: Haldi, Mehendi 1st Nov: Wedding, Reception
God bless the couple abundantly in love, joy, and happiness ❤️
@IAmVarunTej @Itslavanya#VarunLav pic.twitter.com/dy4aV58hg3
— Team VarunTej (@TeamVarunTej) October 30, 2023
పెళ్లి ముహూర్తం, రిసెప్షన్ వివరాలివే..
ఇక బుధవారం (నవంబర్ 1) న వరుణ్ తేజ్, లావణ్యలు ఒక్కటిగా కానున్నారు. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 2.48 గంటలకు లావణ్య మెడలో వరుణ్ మూడు ముళ్లు వేయనున్నాడు. ఇక పెళ్లి ముగిసిన తర్వాత రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి రిసెప్షన్ కార్యక్రమం జరుగుతుంది.
కాక్ టైల్ పార్టీలో కాబోయే దంపతులు..
All about the Last night #VarunLav ✨ cocktail party🎉#VarunTej #LavanyaTripathi Global Star #RamCharan Icon StAAr #AlluArjun pic.twitter.com/moBvNIZBqK
— RamCharan FC™ (@AlwayzCharanFC) October 31, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..