- Telugu News Photo Gallery Sports photos Sania Mirza meets husband Shoaib Malik amid divorce rumours, Photos goes viral
Sania Mirza: కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో జంటగా సానియా, షోయబ్.. విడాకుల వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్టేనా?
భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోనున్నారంటూ గత కొన్నినెలలుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ విడిపోయి విడివిడిగా జీవిస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిపై అటు సానియా కానీ, షోయబ్ కానీ స్పందించిన దాఖలాలు లేవు.
Updated on: Oct 30, 2023 | 2:19 PM

భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోనున్నారంటూ గత కొన్నినెలలుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ విడిపోయి విడివిడిగా జీవిస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిపై అటు సానియా కానీ, షోయబ్ కానీ స్పందించిన దాఖలాలు లేవు.

ప్రస్తుతం సానియా తన కుమారుడు ఇజాన్ తో కలిసి దుబాయ్‌లోనే నివసిస్తోంది. మరోవైపు షోయబ్ మాలిక్ పాకిస్తాన్‌లోనే నివసిస్తుండడం వీరి విడాకుల రూమర్లకు బలం చేకూర్చుతోంది.

పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ నటి అయేషా ఉమర్‌తో మాలిక్ వివాహేతర సంబంధం కూడా సానియాతో విడాకులకు ఒక కారణమని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అయేషా ఎప్పుడో ఖండించింది.

దిలా ఉంటే విడాకుల రూమర్లను కొట్టి పారేస్తూ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ తమ కుమారుడి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా జరిపారు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరలవుతున్నాయి.

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 2010 లో వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్య బంధానికి గుర్తుగా 2018 లో ఇజాన్ మీర్జా మాలిక్ అనే మగబిడ్డకు జన్మినిచ్చారు. తాజాగా ఇజాన్ ఐదో వసంతంలోకి అడుగపెట్టాడు.