AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: హిట్‌మ్యాన్ ఖాతాలో చేరిన మరో రికార్డ్.. సచిన్, కోహ్లీ జాబితాలో చోటు..

ICC World Cup 2023, Rohit Sharma, India vs England: కానీ, రోహిత్‌ను గూగ్లీతో బోల్తా కొట్టించిన రషీద్.. సెంచరీకి 13 పరుగుల దూరంలో పెవిలియన్ చేర్చాడు. ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో ఎనిమిదో టన్నుకు కేవలం 13 పరుగుల దూరంలో రోహిత్ ఔట్ అయ్యాడు. దీంతో ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీల రికార్డును మరింత ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాడు.

Venkata Chari
|

Updated on: Oct 29, 2023 | 6:43 PM

Share
ఆదివారం లక్నోలో ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ప్రపంచ కప్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 18000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. దీంతో భారత దిగ్గజాల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు.

1 / 6
భారత కెప్టెన్ తన 477వ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను చేరుకున్నాడు. ఈ మార్కును దాటిన ఐదవ భారత ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ ఉన్నారు.

2 / 6
21వ ఓవర్‌లో ఆదిల్ రషీద్ వేసిన స్లాగ్ స్వీప్ బౌండరీతో రోహిత్ ఈ మార్కును చేరుకున్నాడు. 12 ఓవర్లు ముగిసేసరికి 40/3తో నిలిచిన భారత్ ఇన్నింగ్స్‌ను  కేఎల్ రాహుల్‌తో కలిసి రోహిత్ అద్భుతంగా నిర్మించాడు. అతను మార్క్ వుడ్‌పై పుల్ షాట్‌తో 66 బంతుల్లో 54వ వన్డే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.

3 / 6
కానీ, రోహిత్‌ను గూగ్లీతో బోల్తా కొట్టించిన రషీద్.. సెంచరీకి 13 పరుగుల దూరంలో పెవిలియన్ చేర్చాడు. ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో ఎనిమిదో టన్నుకు కేవలం 13 పరుగుల దూరంలో రోహిత్ ఔట్ అయ్యాడు.

4 / 6
రోహిత్ 18,000 పరుగులలో, 3677 టెస్ట్‌లలో రాబట్టగా, 3853 T20I లలో, 10,470 వన్డే ఇంటర్నేషనల్స్‌లో వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌కు 45 సెంచరీలు, 98 అర్ధశతకాలు ఉన్నాయి.

5 / 6
2023లో వన్డేల్లో 1000 పరుగులు దాటిన శుభ్‌మన్ గిల్,  పాతుమ్ నిస్సాంక తర్వాత రోహిత్ మూడో బ్యాటర్ అయ్యాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో రోహిత్ నాలుగు అంకెల మార్క్‌ను దాటడం ఇది ఐదోసారి.

6 / 6