AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India: దేశంలో మరో సంక్షోభం.. వంట గ్యాస్ బాటలో వీటి ధరలు.. త్వరలోనే పెరిగే అవకాశం..

దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరుగతున్నాయి. ఇప్పటికే రూ.60 మేర డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెరగ్గా.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరిగింది. త్వరలో గ్యాస్ బాటలో మరో వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Mar 12, 2026 | 7:52 PM

Share
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ద ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడుతోంది. దేశంలో పలు వస్తువులకు కొరతతో పాటు ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ కొరతతో దేశంలోని ప్రజలు ఇబ్బంది పడుతుండగా.. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగుతుండటంతో పెట్రోల్ ధరలు కూడా పెరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలో మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశముంది.

1 / 5
త్వరలో మెడిసిన్స్ ధరలు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. యాంటీబయాటిక్స్, విటమిన్ల ధరలు పెరగనున్నాయని సమాచారం. ఔషధాల తయారీకి అవసరమయ్యే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ ధరలు పెరుగుతున్నాయి. గల్ప్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో చమురు ధరలు పెరగడం, షిప్పింగ్ మార్గాలు మూతపడటంతో వీటి ధరల్లో పెరుగుదల నమోదవుతోంది.

2 / 5
ఔషధాల తయారీకి ఉపయోగించే ముడి పదార్ధాల ధరలు 5 శాతం నుంచి 10 శాతానికి పెరిగాయి. యూరప్ నుంచి భారత్‌కు 15.4 శాతం నుంచి 16 శాతం వరకు దిగుమతి అవుతున్నాయి. క్యాన్సర్, గుండెపోటు, ఎండోక్రైన్ రుగ్మతలకు సంబంధించిన మెడిసిన్స్ ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. అయితే ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో రవాణాకు అంతరాయం కలగడం వల్ల ధరలపై ప్రభావం పడుతుంది.

3 / 5
సౌదీ అరేబియా, యూఏఈ నుంచి స్టార్టింగ్ మెటిరియల్స్, ద్రవకాలను భారత్ దిగుమతి చేసుకుంటుంది. దేశీయంగా మెడిసిన్స్ తయారీకి ఇవి చాలా అవసరం. ఇక ఔషధాలు తయారు చేసేందుకు పెట్రోలియం ఆధారిత రసాయనాలపై ఆధారపడుతున్నారు. చమురు ధరలు పెరుగుదల, సరఫరా కొరత వల్ల ఔషధాల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది.

4 / 5
ఈ క్రమంలో మెడిసిన్స్ ఇన్‌పుట్ ధరలు పెరిగాయి. రవాణా ఖర్చులు 200 నుంచి 300 శాతం పెరగడం, షిప్‌మెంట్ ఛార్జీలు 4 నుంచి 8 వేల డాలర్ల మధ్య ఉన్నాయని భారతీయ ఫార్మాస్యూటికల్స్ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ తెలిపింది. అయితే 98 నుంచి 175 రోజుల ఔషధ నిల్వలు ఉండగా.. తక్షణమై ధరలు పెరగకపోవచ్చు.  యుద్దం ఇలాగే కొనసాగితే ధరలు పెరుగుతాయి.

5 / 5
Follow Us