AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC World Cup 2023: ఇంత కన్నా ఏం కావాలి? సంతోషంలో రోహిత్‌ శర్మ ఎత్తుకున్న విరాట్ కోహ్లీ.. వీడియో చూశారా?

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 229 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 87 పరుగులు చేశాడు. సూర్య కుమార్‌ యాదవ్‌ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ తప్ప మిగతా భారత బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. ఆ తర్వాత 230 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగని ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు బెంబెలెత్తించారు.

ICC World Cup 2023: ఇంత కన్నా ఏం కావాలి? సంతోషంలో రోహిత్‌ శర్మ ఎత్తుకున్న విరాట్ కోహ్లీ.. వీడియో చూశారా?
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మకు సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ అతను ఔటయ్యాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆరంభం అంతగా రాణించకపోవడంతో భారత జట్టు 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
Follow us
Basha Shek

|

Updated on: Oct 30, 2023 | 10:49 AM

వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ విజయం సాధించిన భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. అలాగే సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. ఇక ఆదివారం (అక్టోబర్‌ 30)న లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఏకంగా 100 పరుగుల తేడాతో ఇంగ్లిష్‌ జట్టును మట్టి కరిపించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 229 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 87 పరుగులు చేశాడు. సూర్య కుమార్‌ యాదవ్‌ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ తప్ప మిగతా భారత బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. ఆ తర్వాత 230 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగని ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు బెంబెలెత్తించారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలు నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కుప్పకూల్చారు. కుల్‌ దీప్‌, జడేజా కూడా రాణించడంతో ఇంగ్లండ్‌ 129 పరుగులకే చాప చుట్టేసింది. 100 పరుగుల తేడాతో టీమిండియా ప్రపంచకప్‌లో వరుసగా ఆరో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో మరో విశేషం.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల సెలబ్రేషన్స్‌. ఇంగ్లండ్‌ వికెట్లు పడినప్పుడల్లా కోహ్లీ, హిట్‌ మ్యాన్‌ కలిసి సంబరాలు చేసుకున్నారు. ఒక సందర్భంలో అయితే సంతోషంతో ఊగిపోయిన విరాట్.. రోహిత్‌ శర్మను పైకెత్తుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ‘ఈ బంధం చాలా ప్రత్యేకం. వీరిని ఇలా చూస్తుంటే ప్రపంచకప్‌ గెల్చినంత సంతోషంగా ఉంది. 140 కోట్ల మంది భారతీయుల ప్రపంచకప్‌ కలను విరాట్‌, రోహిత్ నిజం చేయాలి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 87 పరుగులతో రోహిత్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడితే, విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఇవి కూడా చదవండి

రోహిత్- కోహ్లీల సంబరాలు..

రోహిత్ ను గాల్లోకి ఎత్తేసిన విరాట్..

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ పూర్తి మ్యాచ్ హైలెట్స్..

View this post on Instagram

A post shared by ICC (@icc)

ఇండియా గెలుపు సంబరాలు ..

View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

May 2025 Horoscope: వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే ఛాన్స్..
May 2025 Horoscope: వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే ఛాన్స్..
సముద్ర మథనంలో లక్ష్మీదేవి సహా ఉద్భవించిన వస్తువులుఇవే ప్రాముఖ్యత
సముద్ర మథనంలో లక్ష్మీదేవి సహా ఉద్భవించిన వస్తువులుఇవే ప్రాముఖ్యత
అతి తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్.. ఆ కార్డులతో మరింత డిస్కౌంట్..!
అతి తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్.. ఆ కార్డులతో మరింత డిస్కౌంట్..!
ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బులకు ఇబ్బంది ఉండదు
ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బులకు ఇబ్బంది ఉండదు
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు..
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు..
OU ఆర్ట్స్‌ కాలేజ్ భవనానికి ఇండియన్‌ ట్రేడ్‌ మార్క్‌ సర్టిఫికెట్
OU ఆర్ట్స్‌ కాలేజ్ భవనానికి ఇండియన్‌ ట్రేడ్‌ మార్క్‌ సర్టిఫికెట్
వాటర్‌ కోసం ఫ్రిజ్‌ ఓపెన్ చేయగా.. లోపల సీన్ చూసి గుండె గుబేల్‌..
వాటర్‌ కోసం ఫ్రిజ్‌ ఓపెన్ చేయగా.. లోపల సీన్ చూసి గుండె గుబేల్‌..
ఈ పండ్లతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
ఈ పండ్లతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో విదురుడు క్లారిటీగా చెప్పాడు
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో విదురుడు క్లారిటీగా చెప్పాడు
మీ కారు అద్దాలకు క్రాక్స్ వచ్చాయా? సింపుల్ టెక్నిక్‌తో సమస్య ఫసక్
మీ కారు అద్దాలకు క్రాక్స్ వచ్చాయా? సింపుల్ టెక్నిక్‌తో సమస్య ఫసక్