- Telugu News Photo Gallery Cinema photos Shah Rukh Khan's Jawan Movie To Stream On Netflix OTT From November 2nd
Jawan OTT : షారుఖ్ బర్త్ డే స్పెషల్.. ఓటీటీలోకి జవాన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన సినిమా జవాన్. సౌతిండియన్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
Updated on: Oct 29, 2023 | 2:13 PM

పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన సినిమా జవాన్. సౌతిండియన్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది.

సెప్టెంబర్ 7న విడుదలైన ఈ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా 1150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.

ఇప్పుడీ జవాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ షారుఖ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది.

ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 2న జవాన్ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారట. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట.

జవాన్ సినిమాలో ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఓ అతిథి పాత్రలో మెరిసింది. జవాన్ సినిమాకు కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.




