- Telugu News Photo Gallery Cinema photos Nithya Menon Interesting Comments On Her Marriage And Relationship
Nithya Menon: అలాంటి వాడు దొరికితే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భర్త క్వాలిటీస్ చెప్పేసిన నిత్యా మేనన్
ప్రస్తుతం సినిమాలతో పాటు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మేనన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూనే వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటుంది. ఇటీవలే మాస్టర్ పీస్ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చింది నిత్య.
Updated on: Oct 29, 2023 | 1:55 PM

ప్రస్తుతం సినిమాలతో పాటు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మేనన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూనే వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటుంది. ఇటీవలే మాస్టర్ పీస్ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చింది నిత్య.

మాస్టర్ పీస్ వెబ్ సిరీస్‌లో రియా అనే గృహిణీ పాత్రలో నటించి మెప్పించింది నిత్య. కాగా రియల్ లైఫ్‌లో గృహిణిగా ఆకట్టుకున్న నిత్య మరీ రియల్ లైఫ్‌లో ఎలాంటి భర్త కావాలో ఇటీవల చెప్పుకొచ్చింది.

పెళ్లి అంటేనే సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ముడి పడి ఉందని భావిస్తారు. అయితే నాకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. అంతకు మించీ ఆలోచించే వాళ్లు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానంటోంది నిత్య

అలాగే పెళ్లి విషయంలో నాకు స్థిరమైన అభిప్రాయం ఉందని, మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే లక్షణాలు ఉండాలని చెప్పుకొచ్చిందీ అందాల తార.

మరి నిత్య చెబుతున్న లక్షణాలున్న అబ్బాయి ఎక్కడ ఉన్నాడో? ఎప్పుడు ఆమెకు తారసపడతాడో లెట్స్ వెయిట్ అండ్ సీ..