శ్రీలీల చేతిలోంచి మరో భారీ సినిమా జారిపోయిందా..? ఎంత బ్యాలెన్స్ చేసినా ఒకేసారి 10 సినిమాలకు డేట్స్ ఇవ్వడం అంటే కష్టమే. ఇప్పుడు ఈ సమస్యలతోనే శ్రీలీల ఇబ్బంది పడుతున్నారా..? అసలు ఈమె చేతుల్లోంచి జారిపోయిన ఆ పెద్ద సినిమా ఏంటి..? అందులో ఆమె ప్లేస్‌ను ఎవరు రీ ప్లేస్ చేస్తున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..? శ్రీలీల.. టాలీవుడ్ అన్ అఫీషియల్ నెంబర్ వన్ హీరోయిన్. ఇప్పటి నుంచి నెలకో సినిమా విడుదల చేసుకుంటూ వెళ్లినా.. మరో రెండు మూడు సినిమాలు ఆమె చేతిలో ఉంటాయి.