Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej Wedding: మనవడి పెళ్లిని చూడలేకపోతోన్న అంజనమ్మ.. వరుణ్ వివాహ వేడుకలకు చిరంజీవి తల్లి దూరం.. కారణమిదే

రామ్‌ చరణ్- ఉపాసన దంపతులు కొన్ని రోజుల క్రితమే ఇటలీ చేరుకున్నారు. వరుణ్  పెళ్లి వేడుకలను చెర్రీనే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక చిరంజీవి- సురేఖ దంపతులు అక్కడే ఉన్నారు పవన్‌ కల్యాణ్‌- లెజనోవా, అల్లు అర్జున్‌- స్నేహా రెడ్డి దంపతులు కూడా ఇటీలీకి వెళ్లిపోయారు. అయితే మెగాఫ్యామిలీలో ప్రధానమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అయిన అంజనా దేవి మనవడి పెళ్లికి హాజరు కావడం లేదట.

Varun Tej Wedding: మనవడి పెళ్లిని చూడలేకపోతోన్న అంజనమ్మ.. వరుణ్ వివాహ వేడుకలకు చిరంజీవి తల్లి దూరం.. కారణమిదే
Varun Tej, Lavanya Tripathi
Follow us
Basha Shek

|

Updated on: Oct 29, 2023 | 1:51 PM

మెగా ప్రిన్స్‌, నాగ బాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్​ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటలీలోని టుస్కాన్‌ వేదికగా అందాల రాక్షసి హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు వరుణ్. నవంబర్‌ 1వ తేదీన వరుణ్‌- లావణ్యల వివాహ వేడుక జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇక పెళ్లి కోసం మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు ఒక్కొక్కరు ఇటలీ చేరుకుంటున్నారు. రామ్‌ చరణ్- ఉపాసన దంపతులు కొన్ని రోజుల క్రితమే ఇటలీ చేరుకున్నారు. వరుణ్  పెళ్లి వేడుకలను చెర్రీనే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక చిరంజీవి- సురేఖ దంపతులు అక్కడే ఉన్నారు పవన్‌ కల్యాణ్‌- లెజనోవా, అల్లు అర్జున్‌- స్నేహా రెడ్డి దంపతులు కూడా ఇటీలీకి వెళ్లిపోయారు. అయితే మెగాఫ్యామిలీలో ప్రధానమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అయిన అంజనా దేవి మనవడి పెళ్లికి హాజరు కావడం లేదట. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి రీత్యా ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదని వైద్యులు సూచించారట. అందుకే ఆమె ఇటలీ వెళ్లడం లేదట. ఇండియాలోనే ఉంటున్నారట. అయితే వరుణ్‌- లావణ్యల వివాహ వేడుకను ఇంటి నుంచే ప్రత్యక్షంగా వీక్షించేలా చిరంజీవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారట.

ఇంట్లోనే చూసేలా ఏర్పాట్లు..

కాగా వరుణ్‌- లావణ్యల వివాహ వేడుకల కోసం యంగ్ హీరో నితిన్‌ దంపతులు కూడా ఇటలీకి చేరుకున్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు, అత్యంత సన్నిహితులు, స్నేహితులు వరుణ్‌ పెళ్లికి హాజరుకానున్నారట. అయితే పెళ్లికి హాజరు కానీ సినీ, రాజకీయ ప్రముఖుల కోసం నవంబర్ 5వ తేదీన హైదరాబాద్‍లో వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇక వరుణ్‌ లావణ్యల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. సోమవారం (అక్టోబర్‌ 30)న కాక్‌ టైల్‌ పార్టీ జరగనుంది. అలాగే మంగళవారం (అక్టోబర్‌ 31)న మెహందీ, హల్దీ వేడుకలకు ప్లాన్‌ చేశారు. ఇక నవంబర్‌ 1న వరుణ్‌, లావణ్యల వివాహ జరగనుంది.

ఇవి కూడా చదవండి

కాఫీ డేట్ లో కాబోయే దంపతులు..

హైదరా బాద్ ఎయిర్ పోర్టులో పవన్ కల్యాణ్ దంపతులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ యాప్‌ల చుట్టూ స్కామర్లు.. డౌన్లోడ్ చేస్తే డబ్బులు మాయం
ఈ యాప్‌ల చుట్టూ స్కామర్లు.. డౌన్లోడ్ చేస్తే డబ్బులు మాయం
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
ICL ఫిన్‌కార్ప్‌ను నేషనల్ లెండింగ్ పార్టనర్‌గా నియమించిన NIDCC
ICL ఫిన్‌కార్ప్‌ను నేషనల్ లెండింగ్ పార్టనర్‌గా నియమించిన NIDCC
బతుకు జీవుడా..! ఎట్టకేలకు ఏనుగు నుంచి తప్పించుకొని ఎలా బయటపడ్డాడో
బతుకు జీవుడా..! ఎట్టకేలకు ఏనుగు నుంచి తప్పించుకొని ఎలా బయటపడ్డాడో
రాయుడిని లైవ్‌లో ట్రోల్ చేసిన గబ్బర్
రాయుడిని లైవ్‌లో ట్రోల్ చేసిన గబ్బర్
అమ్మాయి చేతులు చూసి మండపం నుంచి వరుడు జంప్..!
అమ్మాయి చేతులు చూసి మండపం నుంచి వరుడు జంప్..!
నిజమా? మే ఒకటి నుంచి ఫాస్టాగ్ పనిచేయదా?మరీ టోల్ ప్లాజాల సంగతేంటి?
నిజమా? మే ఒకటి నుంచి ఫాస్టాగ్ పనిచేయదా?మరీ టోల్ ప్లాజాల సంగతేంటి?
ఎలుకల్ని తరిమి కొట్టేందుకుఈజీ టిప్స్‌.. ఇలా చేశారంటే రమ్మనా రావు!
ఎలుకల్ని తరిమి కొట్టేందుకుఈజీ టిప్స్‌.. ఇలా చేశారంటే రమ్మనా రావు!
UPSC సివిల్స్‌ తుది ఫలితాలు విడుదల.. టాప్‌-10 ర్యాంకర్లు వీరే
UPSC సివిల్స్‌ తుది ఫలితాలు విడుదల.. టాప్‌-10 ర్యాంకర్లు వీరే