AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Changure Bangaru Raja OTT: ఓటీటీలోకి వచ్చేసిన రవితేజ క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాత గానూ తన అభిరుచిని చాటుకుంటున్నారు మాస్‌ మహారాజా రవితేజ. ఇటీవల టైగర్‌ నాగేశ్వర రావుతో సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ఆయన ఇటీవలే ఛాంగురే బంగారు రాజా అనే ఓ చిన్న సినిమాను నిర్మించారు. క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో కేరాఫ్‌ కంచర పాలెం ఫేమ్‌ కార్తిక్‌ రత్నం హీరోగా నటించాడు.

Changure Bangaru Raja OTT: ఓటీటీలోకి వచ్చేసిన రవితేజ క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
Changure Bangaru Raja Movie
Basha Shek
|

Updated on: Oct 28, 2023 | 9:56 AM

Share

ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాత గానూ తన అభిరుచిని చాటుకుంటున్నారు మాస్‌ మహారాజా రవితేజ. ఇటీవల టైగర్‌ నాగేశ్వర రావుతో సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ఆయన ఇటీవలే ఛాంగురే బంగారు రాజా అనే ఓ చిన్న సినిమాను నిర్మించారు. క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో కేరాఫ్‌ కంచర పాలెం ఫేమ్‌ కార్తిక్‌ రత్నం హీరోగా నటించాడు. అలాగే సత్య, రవిబాబు, గోల్డీ నిస్సీ, నిత్య శ్రీ, ఎస్తర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సతీష్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా సెప్టెంబర్‌ 15న విడుదలైంది. సినిమా బాగున్నా పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో ఛాంగురే బంగారు రాజా జనాలకు పెద్దగా రీచ్‌ కాలేకపోయింది. అయితే ఇప్పుడీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌ రవితేజ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది. శుక్రవారం (అక్టోబర్‌ 27) అర్ధరాత్రి నుంచే ఛాంగురే బంగారు రాజా సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై రవితేజ నిర్మించిన ఛాంగురే బంగారు రాజా సినిమాకు సౌరబ్ స్వరాలు అందించారు. మెహర్‌బాబా, అజ్జు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించగా, కార్తీక్‌ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్తర్తించారు.

 కథేంటంటే..

ఛాంగురే బంగారు రాజా సినిమా విషయానికొస్తే.. రంగురాళ్ల బ్యాక్‌డ్రాప్‌లో మర్డర్‌ మిస్టరీని జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో బైక్ మెకానిక్ బంగర్రాజుగా కార్తీక్‌ రత్నం కనిపించాడు. ఒక రోజుకు బంగర్రాజుకు, అదే వూరిలో ఉండే సోము నాయుడు (రాజ్‌ తిరందాసు)కు గొడవ జరుగుతుంది. అయితే అనూహ్యంగా సోము నాయుడు హత్యకు గురవుతాడు. దీంతో బంగర్రాజు అరెస్ట్‌ అవుతాడు. మరి అతను ఎలా బయట పడ్డాడు. అతనికి సత్య, రవిబాబులకు మధ్య ఉన్న సంబంధమేంటో తెలుసుకోవాలంటే ఛాంగురే బంగారు రాజా సినిమా చూడాల్సిందే. థియేటర్లలో ఈ మూవీని మిస్‌ అయ్యింటే మాత్రం ఓటీటీలో మంచి ఛాయిస్‌.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

రవితేజతో హీరో కార్తీక్ రత్నం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి