Skanda OTT: ఓటీటీలో రామ్‌ మాస్‌ ర్యాంపేజ్‌ అప్పుడే.. ‘స్కంద’ స్ట్రీమింగ్‌పై అప్డేట్ ఇచ్చిన ఓటీటీ సంస్థ

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని నటించిన సినిమా స్కంద. థియేటర్లలో విడుదలై యావరేజ్‌గా నిలిచిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇవాళ (అక్టోబర్‌ 27)న ఓటీటీలోకి వస్తుందని చాలామంది భావించారు. అయితే రామ్‌ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. స్కంద ఓటీటీలోకి అందుబాటులోకి రాలేదు. తాజాగా రామ్ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌పై ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్కంద సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టింది.

Skanda OTT: ఓటీటీలో రామ్‌ మాస్‌ ర్యాంపేజ్‌ అప్పుడే.. 'స్కంద' స్ట్రీమింగ్‌పై  అప్డేట్ ఇచ్చిన ఓటీటీ సంస్థ
Skanda Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 28, 2023 | 7:36 AM

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని నటించిన సినిమా స్కంద. థియేటర్లలో విడుదలై యావరేజ్‌గా నిలిచిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇవాళ (అక్టోబర్‌ 27)న ఓటీటీలోకి వస్తుందని చాలామంది భావించారు. అయితే రామ్‌ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. స్కంద ఓటీటీలోకి అందుబాటులోకి రాలేదు. తాజాగా రామ్ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌పై ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్కంద సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టింది. ‘గతంలో మరెన్నడూ చూడని మాస్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం’ అని తెలిపిన హాట్‌ స్టార్‌ ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు స్కంద సినిమా స్ట్రీమింగ్‌ కొత్త డేట్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. అయితే రామ్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌ నవంబర్‌కు వాయిదా పడిందని తెలుస్తోంది. బహుశా దీపావళి పండగను పురస్కరించుకుని ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు. దీనిపై ఇవాళ సాయంత్రం క్లారిటీ రానుంది. స్కంద సినిమాకు బోయపాటి శీను దర్శకత్వం వహించారు. యంగ్ సెన్సేషన్‌ శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్‌ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ మరో కథానాయికగా కనిపించింది. సెప్టెంబర్‌ 28న రిలీజైన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఓవరాల్‌గా బాక్సాఫీస్‌ వద్ద రూ. 50 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఎటూ తేలడం లేదు. అక్టోబర్‌ 27 నుంచి రామ్ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రానున్నట్లు ప్రచారం జరిగింది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రామ్ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టాక్‌ వినిపించింది. అయితే అనూహ్యంగా ఇది వాయిదా పడడంతో రామ్‌ ఫ్యాన్స్‌ నిరాశకు లోనవుతున్నారు.

సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్‌ చిట్టూరి, పవన్‌ కుమార్‌ సంయుక్తంగా స్కంద సినిమాను నిర్మించారు ఇందులో రామ్‌ డబుల్‌ రోల్‌లో కనిపించగా.. శ్రీకాంత్, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్‌, ప్రభాకర్‌, గౌతమి, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది.  ఈ మూవీకి ఎస్‌. థమన్‌ స్వరాలు సమకూర్చారు. ఇప్పటివరకు యూత్‌ ఫుల్‌ అండ్‌ లవ్‌ స్టోరీల్లోనే ఎక్కువగా నటించిన ఉస్తాద్‌ రామ్‌ స్కంద సినిమాలో మొదటిసారి ఊరమాస్‌గా నటించాడు. ఇక ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌ సుమారు రూ. 35 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఈరోజు సాయంత్రం 5 గంటలకు అప్డేట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!