Mad Movie OTT: ఓటీటీలోకి లేటెస్ట్‌ సూపర్‌ హిట్‌ మూవీ.. మ్యాడ్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన మూవీస్‌లో మ్యాడ్‌ ఒకటి. ఇంజినీరింగ్‌ కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. అన్ని చోట్లా పాజిట్‌ టాక్‌, రివ్యూలు వచ్చాయి. దీతో మ్యాడ్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది

Mad Movie OTT: ఓటీటీలోకి లేటెస్ట్‌ సూపర్‌ హిట్‌ మూవీ.. మ్యాడ్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Mad Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 31, 2023 | 6:26 AM

ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన మూవీస్‌లో మ్యాడ్‌ ఒకటి. ఇంజినీరింగ్‌ కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌, రివ్యూలు వచ్చాయి. దీంతో మ్యాడ్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ మ్యాడ్‌ సినిమాతోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అతనితో పాటు సంతోష్‌ శోభన్‌ తమ్ముడు సంగీత్‌ శోభన్‌ ఇందులో కీలక పాత్ర పోషించాడు. తన కామెడీతో ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు. వీరితో పాటు మూడో హీరోగా రామ్‌ నితిన్‌ కూడా జనాలను అలరించాడు. అక్టోబర్‌ 6న థియేటర్లలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన మ్యాడ్ సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఈ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నవంబర్‌ మొదటి వారంలో మ్యాడ్‌ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

మ్యాడ్ సినిమాకు కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీ గౌరి ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘు బాబు, రచ్చ రవి, మురళీధర్‌ గౌడ్‌, విష్ణు, ఆంటోని, శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ప్రముఖ దర్శకుడు కేవీ అనుదీప్‌ ఈ మూవీలో ఓ క్యామియో రోల్‌లో మెరవడం విశేషం. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సతీమణి సాయి సౌజన్య, హారిక సూర్యదేవర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. భీమ్స్‌ సిసిరిలియో అందించిన పాటలు చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి. ఇక మ్యాడ్‌ కథేంటంటే.. ఈ సినిమా మొత్తం ఇంజినీరింగ్‌ కాలేజీ చుట్టే తిరుగుతోంది. మ‌నోజ్ (రామ్ నితిన్‌), అశోక్ (నార్నే నితిన్‌), దామోద‌ర్ అలియాస్ డీడీ (సంగీత్‌ శోభ‌న్‌) ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చేరతారు. వారి జీవితాల్లోకి జెన్నీ(అనంతిక‌), శృతి (శ్రీగౌరిప్రియారెడ్డి), , రాధ (గోపిక ఉద్యాన్‌) వస్తారు. మరి ఈ ముగ్గురి వ‌ల్ల అశోక్‌, మ‌నోజ్‌, డీడీ జీవితాలు ఎలా మారిపోయాయి? అన్నది ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు డైరెక్టర్‌. థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వుకున్నారు. మరి మీరు ఈ సినిమాను మిస్‌ అయ్యారా? లేక మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఓటీటీ రిలీజ్‌ కోసం వెయిట్‌ చేయండి.

మ్యాడ్ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!