Bigg Boss 7 Telugu: ఓటింగ్‌లో ఉల్టా పుల్టా.. దూసుకెళుతోన్న భోలే.. డేంజర్‌ జోన్‌లో ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్‌

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ఎనిమిదో వారం నామినేషన్లు హోరాహోరీగా సాగాయి. కంటెస్టెంట్లు ఒకరిని ఒకరు నామినేట్‌ చేస్తూ తిట్టుకున్నారు. ముఖ్యంగా శివాజీ- శోభా వెట్టి, పల్లవి ప్రశాంత్‌- గౌతమ్‌ కృష్ణ, శోభా శెట్టి- భోలే షా వలి- ప్రియాంకల మధ్య మాటల తూటాలు పేలాయి. బిగ్‌ బిస్‌7 ఎనిమిదో వారంలో మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్‌లోకి వచ్చారు. శివాజీ, అశ్విని శ్రీ, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్, ఆట సందీప్, భోలే షావలి, గౌతమ్ కృష్ణ నామినేషన్ల లిస్టులో ఉన్నారు

Bigg Boss 7 Telugu: ఓటింగ్‌లో ఉల్టా పుల్టా.. దూసుకెళుతోన్న భోలే.. డేంజర్‌ జోన్‌లో ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్‌
Bigg Boss Telugu 7
Follow us
Basha Shek

|

Updated on: Oct 27, 2023 | 9:25 AM

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ఎనిమిదో వారం నామినేషన్లు హోరాహోరీగా సాగాయి. కంటెస్టెంట్లు ఒకరిని ఒకరు నామినేట్‌ చేస్తూ తిట్టుకున్నారు. ముఖ్యంగా శివాజీ- శోభా వెట్టి, పల్లవి ప్రశాంత్‌- గౌతమ్‌ కృష్ణ, శోభా శెట్టి- భోలే షా వలి- ప్రియాంకల మధ్య మాటల తూటాలు పేలాయి. బిగ్‌ బిస్‌7 ఎనిమిదో వారంలో మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్‌లోకి వచ్చారు. శివాజీ, అశ్విని శ్రీ, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్, ఆట సందీప్, భోలే షావలి, గౌతమ్ కృష్ణ నామినేషన్ల లిస్టులో ఉన్నారు. ఇక వీరికి సోమవారం నుంచి ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఎప్పటి లాగే బిగ్‌ బాస్‌ పెద్దన్న శివాజీ అత్యధిక ఓటింగ్స్‌తో అగ్ర స్థానంలో ఉన్నాడు. అయితే అనూహ్యంగా సింగర్‌ భోలే షా వళి ఓటింగ్స్‌లో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం అతను రెండో స్థానంలో ఉండటం గమనార్హం. మూడో స్థానంలో సీరియల్ బ్యాచ్‌ లీడర్‌ అమర్ దీప్ చౌదరి కొనసాగుతున్నాడు. అలాగే నాలుగో స్థానంలో అశ్విని శ్రీ, ఐదో ప్లేస్‌ లో గౌతమ్‌ కృష్ణ, ఆరో స్థానంలో ప్రియాంక జైన్‌ ఉన్నారు. ఇక ఏడో స్థానంలో సందీప్‌ మాస్టర్‌ ఉండగా, అట్టడుగు స్థానంలో కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి ఉంది. ఒక వేళ ఇదే ఫ్లో కొనసాగితే మాత్రం మోనిత బిగ్‌ బాస్‌ నుంచి బయటకు వెళ్లాల్సిందే.

కాగా బిగ్‌ బాస్‌ హౌజ్‌కు కావాల్సిన కంటెంట్‌ అందిస్తోంది శోభా శెట్టి. అయితే ఇదే సమయంలో తన బిహేవియర్‌, మాటలతో ఆడియెన్స్‌కు చికాకు తెప్పిస్తోందన్న విమర్శలు మూట గట్టుకుంది. అందుకే ఆమెపై భారీగా ట్రోలింగ్‌ జరుగుతోంది. ఇప్పుడిదే ఓటింగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపి నట్లు తెలుస్తోంది. దీనికి తోడు శివాజీ ఈ వారం సీరియల్‌ బ్యాచ్‌కు గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు. సీరియల్‌ బ్యాచ్‌ నుంచి ఒక పెద్ద చేప బయటకు వెళ్లిపోతంది అని ముందుగానే హింట్‌ ఇచ్చేశాడు బిగ్‌ బాస్‌ పెద్దన్న. అలా ఈ వారం నామినేషన్స్‌, ఓటింగ్ లిస్టు చూస్తే ప్రియాంక జైన్‌, సందీప్‌ మాస్టర్‌, శోభా శెట్టి డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. అయితే శోభాతో పోల్చుకుంటే ప్రియాంక, సందీప్‌ లపై జనాలకు కాస్త పాజిటివ్‌ ఫీల్‌ ఉంది. కాబట్టి ఈ వారం మోనిత పెట్టె సర్దేసుకోక తప్పదని తెలుస్తోంది. అయితే ఈ కార్తీక దీపం విలన్‌కు బిగ్‌ బాస్‌ అండ మెండుగా ఉంది. మరి ఎలిమినేషన్‌లో ఏమైనా మార్పులు వస్తాయా? శోభను గట్టెక్కించేందుకు మరొకరిని బలి పశువుని చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.\

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ ఓటింగ్స్ లేటెస్ట్ రిపోర్టు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే