Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్‌ రైతు బిడ్డలా కనిపించడంలేదు.. శివాజీ సపోర్టు అందుకే: నటరాజ్‌ మాస్టర్‌

ఉల్టా పుల్టా పేరుతో సాగుతోన్న బిగ్ బాస్ ఏడో సీజన్ పై కొందరు ప్రముఖులు సంచలన కామెంట్లు చేస్తున్నారు. ఇందులో గతంలో బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన వారే. ఇప్పటికే అఖిల్ సార్ధక్, అర్జున్ కల్యాణ్ వంటి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు ఏడో సీజన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా బిగ్ బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ మరోసారి ఈ రియాలిటీ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు

Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్‌ రైతు బిడ్డలా కనిపించడంలేదు.. శివాజీ సపోర్టు అందుకే: నటరాజ్‌ మాస్టర్‌
Nataraj Master, Pallavi Prashanth, Shivaji
Follow us
Basha Shek

|

Updated on: Oct 26, 2023 | 1:55 PM

ప్రముఖ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ ఏడో సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. అలాగే మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు హౌజ్ నుంచి వెళ్లిపోగా ఎలిమినేట్ అయిన రతికా రోజ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హౌజ్ లో 13 మంది కంటెస్టెంట్స్ కొనసాగుతున్నారు. ఉల్టా పుల్టా పేరుతో సాగుతోన్న బిగ్ బాస్ ఏడో సీజన్ పై కొందరు ప్రముఖులు సంచలన కామెంట్లు చేస్తున్నారు. ఇందులో గతంలో బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన వారే. ఇప్పటికే అఖిల్ సార్ధక్, అర్జున్ కల్యాణ్ వంటి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు ఏడో సీజన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా బిగ్ బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ మరోసారి ఈ రియాలిటీ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హౌజ్ లో టాప్ కంటెస్టెంట్స్ గా కొనసాగుతోన్న శివాజీ, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ లపై మాస్టర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ‘రైతు బిడ్డ అని చెప్పగానే పల్లవి ప్రశాంత్‌పై సానుభూతితో కూడిన అభిప్రాయం జనాల్లో ఏర్పడింది. అందుకే అతనికి బాగా మద్దతు లభిస్తోంది. ఈ పాయింట్ తోనే ప్రశాంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎదిగాడు. నాకు తెలిసిగ్‌ బిగ్ బా స్‌లోకి వెళ్లాలని అతను గత మూడేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి హౌజ్ లోకి రాక ముందే బాగా గ్రౌండ్ వర్క్ చేశాడు. బిగ్ బాస్ ఫ్యాన్స్ పేజీలు ఉన్న వారందరినీ ప్రశాంత్ ముందే కలిశాడు. అలాగే పలు యూట్యూబ్ చానెల్స్ నిర్వాహకులు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో స్ట్రాంగ్ గా ఉన్న వారందరినీ కలిసినట్లు తెలుస్తోంది. అయితే హౌజ్ లో ప్రశాంత్  రైతు బిడ్డలా మాత్రం  కనిపించడంలేదు. అతనిపై సినిమాల  ప్రభావం ఎక్కువగా ఉంది. నామినేషన్ ప్రక్రియలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది ‘అని నటరాజ్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

శివాజీ కూడా అందుకే సపోర్టు..

ఇక శివాజీ కూడా ఒక రైతు బిడ్డకు సాయం చేసినట్లు తన ఇమేజ్ ను పెంచుకునేందుకు ట్రై చేస్తున్నాడంటూ నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘బిగ్ బాస్ హౌజ్ లో శివాజీ కేవలం ప్రిన్స్ యావర్,  పల్లవి ప్రశాంత్ కు మాత్రమే సపోర్టుగా ఉన్నారు. వారిద్దరూ కాకుండా మరో  వ్యక్తి ఉండే చూపించండి. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ కు ప్రతి విషయంలో శివాజీ అండగా నిలుస్తున్నాడు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు నటరాజ్ మాస్టర్. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

 అనుపమతో నటరాజ్ మాస్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు