Krishna Gadu Ante Oka Range OTT: ఓటీటీలోకి వచ్చేసిన పల్లెటూరి ప్రేమకథ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నూతన నటీనటులు రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం కృష్ణ గాడు అంటే ఒక రేంజ్‌. స్వచ్చమైన పల్లెటూరి ప్రేమకథకు కాస్త క్రైమ్‌ టచ్‌ను జోడించి నూతన దర్శకుడు రాజేష్‌ దొండపాటి ఈ సినిమాను తెరకెక్కించారు. దిల్‌ రాజు లాంటి టాప్‌ ప్రొడ్యూసర్‌ ఈ సినిమా ట్రైలర్‌ను

Krishna Gadu Ante Oka Range OTT: ఓటీటీలోకి వచ్చేసిన పల్లెటూరి ప్రేమకథ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Krishna Gadu Ante Oka Range Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 24, 2023 | 1:25 PM

నూతన నటీనటులు రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం కృష్ణ గాడు అంటే ఒక రేంజ్‌. స్వచ్చమైన పల్లెటూరి ప్రేమకథకు కాస్త క్రైమ్‌ టచ్‌ను జోడించి నూతన దర్శకుడు రాజేష్‌ దొండపాటి ఈ సినిమాను తెరకెక్కించారు. దిల్‌ రాజు లాంటి టాప్‌ ప్రొడ్యూసర్‌ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేయడంతో సినిమపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంతకుమించి పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంతో ఆగస్టు 4న థియేటర్లలో విడుదలైన కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌ సినిమా ఒక మోస్తరుగా మాత్రమే ఆడింది. ఇప్పుడీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన సుమారు 3 నెలల తర్వాత కృష్ణ గాడు అంటే ఒక రేంజ్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

సినిమా కథేంటంటే..

కృష్ణ (రిష్వి) ఓ పల్లెటూరి కుర్రాడు. సొంత ఇల్లు కట్టి తండ్రి కలను నెరవేర్చుకోవాలనుకుంటాడు. అలాంటి కుర్రాడి జీవితంలో అనుకోకుండా ఓ అమ్మాయివ‌స్తుంది. ఎంతో సాఫీగా సాగిపోతున్న అత‌ని జీవితంలో కొన్ని ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు వ‌స్తాయి. మరి తండ్రి కోరిక‌ను కృష్ణ ఎలా నేర్చ‌వేర్చాడు.? కృష్ణ అనుకున్న ప‌ని సాధించాడా.? త‌న ప్రేమ‌ను గెలుచుకున్నాడా? కృష్ణ జీవితంలో త‌న ఊరితో ఉండే అనుబంధం ఎలాంటిది.? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రేమకథ సినిమాలు చూడాలనుకునేవారికి కృష్ణ గాడు అంటే ఒక రేంజ్‌ మంచి ఛాయిస్‌.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

పల్లెటూరిలో సాగే ప్రేమ కథ..

కృష్ణ గాడు అంటే ఒక రేంజ్‌ హీరోయిన్‌ విస్మయ శ్రీ గతంలో కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించింది. అలాగే కొన్ని సినిమాల్లోనూ మెరిసింది. దిల్‌ సే, మైల్స్‌ ఆఫ్‌ లవ్‌ వంచి యూత్‌ లవ్‌ స్టోరీలు విస్మయకు మంచి పేరును తీసుకొచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..