AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan- Upasana: రామ్ చరణ్‌- ఉపాసనల కూతురిని చూశారా? వైరలవుతోన్న క్లింకార క్యూట్‌ ఫొటోస్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఈ ఏడాది జూన్‌లో అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందిన సంగతి తెలిసిందే. జూన్‌ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా మనవరాలి రాకతో చిరంజీవి- సురేఖ సంబరాల్లో మునిగిపోయారు అభిమానులు కూడా మెగా ప్రిన్సెస్‌ రాకను ఓ పండగలా సెలబ్రేట్‌ చేసుకున్నారు.

Ram Charan- Upasana: రామ్ చరణ్‌- ఉపాసనల కూతురిని చూశారా? వైరలవుతోన్న క్లింకార క్యూట్‌ ఫొటోస్‌
Ram Charan, Upasana
Basha Shek
|

Updated on: Oct 23, 2023 | 1:30 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఈ ఏడాది జూన్‌లో అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందిన సంగతి తెలిసిందే. జూన్‌ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా మనవరాలి రాకతో చిరంజీవి- సురేఖ సంబరాల్లో మునిగిపోయారు అభిమానులు కూడా మెగా ప్రిన్సెస్‌ రాకను ఓ పండగలా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఆ తర్వాత వేడుకగా బారసాల జరిపి మెగా ప్రిన్సెస్‌కు క్లింకార కొణిదెల అని నామకరణం చేశారు రామ్‌ చరణ్‌- దంపతులు. కాగా చాలామంది సెలబ్రిటీల్లాగే ఉపాసన దంపతులు తమ కూతురి విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు. అందుకే తమ లిటిల్‌ ప్రిన్స్‌ ముఖాన్ని ఇంతవరకు చూపించలేదు. మరోవైపు క్లింకారను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రామ్ చరణ్‌ దంపతులు మాత్రం తమ కూతురు ప్రైవసీ విషయంలో దృఢ నిశ్చయంతో ఉన్నారని అందుకే తన ఫొటోలు బయటకు రానివ్వడం లేదంటూ తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌ కూతురంటూ సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు దర్శనమిస్తున్నాయి.

నిజమిదే..

అయితే ఇవి రియల్‌ ఫొటోలు కాదు. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహకారంతో కొందరు క్లింకార ఫొటోలను అద్బుతంగా డిజైన్‌ చేస్తున్నారు. అలా రామ్‌ చరణ్‌ చేతుల్లో బేబీ ఉన్న ఏఐ ఫొటో ఒకటి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులు ఇటీవలే ఇటలీకి వెళ్లారు. తమ కూతురు క్లింకార కొణిదెలతోపాటు.. చరణ్ పెట్ డాగ్‌ రైమ్‏ను తీసుకొని వెళ్తూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠీ పెళ్లి పనుల కోసం వీరు ఇటలీ చేరుకున్నారు. వరుణ్ పెళ్లి పనులను రామ్‌ చరణ్‌ దంపతులు దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ అనే సినిమాలో నటిస్తున్నారు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్‌, సునీల్, ఎస్‌ జే సూర్య, సముద్రఖని, నాసర్‌, నవీన్‌ చంద్ర, రాజీవ్‌ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌. థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్‌ కానుంది.

ఎంత క్యూట్ గా ఉందో .. ఏఐ ఫొటో..

View this post on Instagram

A post shared by @insta_celebritycouple

వరలక్ష్మీ వ్రతం వేడుకల్లో ఉపాసన, క్లింకార..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..