Bigg Boss 7 Telugu: ‘పడ్డోడు ఎప్పుడూ చెడ్డోడు కాదు’.. అమర్‌దీప్‌ భార్య గట్టిగానే ఇచ్చిపడేసిందిగా..

'పడ్డోడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు.. మంచి పనులు జరగడానికి కాస్త సమయం పడుతుంది' ఇది బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ అమర్‌ దీప్‌ చౌదరి గురించి అతని భార్య తేజస్విని గౌడ తాజాగా షేర్‌ చేసిన ఎమోషనల్‌ పోస్ట్‌. నిజమే.. ఆమె ఇలా అనడానికి చాలా కారణాలున్నాయ్‌. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ ట్యాగ్‌తో ఎంటరిచ్చిన అమర్‌ దీప్ ఎందుకో పూర్తిగా నెగెటివిటీని మూట గట్టుకున్నాడు. ముఖ్యంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌, శివాజీపై అనవసరంగా కామెంట్లు చేసి ఇబ్బందుల్లో పడ్డాడు.

Bigg Boss 7 Telugu: 'పడ్డోడు ఎప్పుడూ చెడ్డోడు కాదు'.. అమర్‌దీప్‌ భార్య గట్టిగానే ఇచ్చిపడేసిందిగా..
Amardeep
Follow us
Basha Shek

|

Updated on: Oct 22, 2023 | 9:18 PM

‘పడ్డోడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు.. మంచి పనులు జరగడానికి కాస్త సమయం పడుతుంది’ ఇది బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ అమర్‌ దీప్‌ చౌదరి గురించి అతని భార్య తేజస్విని గౌడ తాజాగా షేర్‌ చేసిన ఎమోషనల్‌ పోస్ట్‌. నిజమే.. ఆమె ఇలా అనడానికి చాలా కారణాలున్నాయ్‌. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ ట్యాగ్‌తో ఎంటరిచ్చిన అమర్‌ దీప్ ఎందుకో పూర్తిగా నెగెటివిటీని మూట గట్టుకున్నాడు. ముఖ్యంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌, శివాజీపై అనవసరంగా కామెంట్లు చేసి ఇబ్బందుల్లో పడ్డాడు. టాస్కుల్లోనూ పెద్దగా ట్యాలెంట్‌ చూపించలేకపోయాడు. కొన్నిసార్లు బిగ్‌ బాస్‌ అడిగిన దానికి సమాధానాలు చెప్పలేక తెల్ల మొహాలు వేశాడు. హౌజ్‌లోనే కాదు నెట్టింట బాగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. కానీ ఇప్పుడదంతా గతం. గత రెండు వారాలుగా అమర్‌ దీప్‌ ఆటలో బాగా మార్పు వచ్చింది. టాస్కుల్లోనూ సత్తా చాటుతున్నాడు. అందుకే ఇప్పటివరకు అతనిని వాయించేస్తోన్న నాగార్జున సైతం ఈ సీరియల్‌ నటుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘వెల్‌ డన్‌ అమర్ దీప్‌.. అదరగొట్టేశావ్‌’ అంటూ శనివారం నాటి ఎసిపోడ్‌లో నాగ్ వ్యాఖ్యానించారు. దీంతో అమర్‌ దీప్‌ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇక అందరి కంటే అతని భార్య నటి తేజస్విని గౌడ ఫుల్‌ ఖుషీ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే బిగ్‌ బాస్‌ హౌజ్‌లో తన భర్తకు జరిగిన అవమానాలన్నింటినీ గుర్తు చేస్తూ ఒక్క పోస్ట్‌తో అందరికీ సమాధానం చెప్పింది.

బిగ్‌ బాస్‌ లోకి అమర్ ఎంట్రీ ఇవ్వడం, టాస్కుల్లో ఓడిపోయి నిరాశగా ఉన్న క్లిప్స్ దగ్గరి నుంచి బాగా ఆడి నాగార్జున దగ్గరి నుంచి ప్రశంసలు అందుకున్న సీన్స్ అన్నింటినీ కలిపి ఒక వీడియోను రూపొందించిన తేజస్విని దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘ వెల్ డన్ అమర్.. పడ్డోడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు.. మంచి పనులు జరగడానికి కొంచెం సమయం పడుతుంది.. కాబట్టి ధైర్యంగా ఉండు.. బాగా ఆడు.. నువ్వు గెలవగలవు.. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను’ అంటూ ఎమోషనల్‌ వర్డ్స్‌ను రాసుకొచ్చింది తేజస్విని. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని చూసి నెటిజన్లు కూడా అమర్‌ దీప్‌కు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. మేమంతా ఉన్నామంటూ ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

తేజస్విని గౌడ ఎమోషనల్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!