Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geetha Madhuri- Nandu: గీతామాధురి- నందు విడాకులు తీసుకుంటున్నారా? అసలు విషయం ఇదిగో..

. 2014లో ప్రేమ వివాహం చేసుకున్న గీత, నందు మనస్పర్థలు, గొడవల కారణంగా విడిపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తొలిసారిగా ఈ విషయంపై స్పందించాడు నందు. మ్యాన్షన్‌ వెబ్‌ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో మెరిసిన ఈ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌ తాజాగా సిరీస్‌ ప్రమోషన్లలో మాట్లాడాడు. తన పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Geetha Madhuri- Nandu: గీతామాధురి- నందు విడాకులు తీసుకుంటున్నారా? అసలు విషయం ఇదిగో..
Geetha Madhuri, Nandu
Follow us
Basha Shek

|

Updated on: Oct 21, 2023 | 4:10 PM

ప్రముఖ సింగర్‌ గీతా మాధురి, నటుడు నందూ విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా చాలాసార్లు వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే గీత- నందూ మాత్రం వీటిని లైట్‌గా తీసుకున్నారు. ఈ రూమర్లపై ఎప్పుడూ స్పందించలేదు. అయితే ఇటీవల వీరిద్దరి విడాకుల వార్తలు మరీ ఎక్కువైపోయాయి. 2014లో ప్రేమ వివాహం చేసుకున్న గీత, నందు మనస్పర్థలు, గొడవల కారణంగా విడిపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తొలిసారిగా ఈ విషయంపై స్పందించాడు నందు. మ్యాన్షన్‌ వెబ్‌ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో మెరిసిన ఈ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌ తాజాగా సిరీస్‌ ప్రమోషన్లలో మాట్లాడాడు. తన పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘ నాకు, గీతా మాధురికి గొడవలవుతున్నాయని, విడిపోతున్నామంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఈ వార్తలను చూసి మేమిద్దరం నవ్వుకున్నాం. అయినా ఇలాంటి వార్తలను తాము పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎవరూ ఏదో రాసినంత మాత్రా ప్రతిసారి మేం స్పందించాల్సిన అవసరం లేదు. ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు నేను స్పందించాను ‘ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. తద్వారా తమ విడాకులపై వస్తోన్న వార్తలు రూమర్లేనంటూ క్లారిటీ ఇచ్చాడు. మరి నందూ క్లారిఫికేషన్ తోనైనా విడాకుల పుకార్లకు చెక్ పడుతుందేమో చూడాలి.

2014లో ప్రేమ వివాహం చేసుకున్న నందు, గీతా మాధురి దంపతులకు ఒక పాప ఉంది. ఇక పోతే మ్యాన్షన్‌ 24 వెబ్‌ సిరీస్‌లో నందు సైకోగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో మెరిశాడు. ఓంకార్‌ తెరకెక్కించిన ఈ థ్రిల్లింగ్‌ హారర్‌ వెబ్‌ సిరీస్‌లో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషించింది. సత్యారాజ్‌, రావు రమేశ్‌, అవికా గోర్‌, రాజీవ్‌ కనకాల, అభినయ, మానస్‌, బింధు మాధవి, అర్చనా జోస్‌, అమర్‌ దీప్‌, బాహుబలి ప్రభాకర్‌, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఓక్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ఓంకార్‌ స్వయంగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. వికాస్‌ బదీషా సంగీతం అందించారు. అక్టోబర్‌ 17 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో మ్యాన్షన్‌ 24 వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్ ప్రమోషన్లలో గీతా మాధురి, నందూ దంపతులు..

View this post on Instagram

A post shared by @that_actor_nandu

జైలర్ సాంగ్ కు గీతా మాధురి డ్యాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.