Cinema Updates: భగవంత్ కేసరికి మొదటి రోజు అదిరిపోయే వసూళ్లు.. విజయ్ లియో సినిమాకు సెన్సేషనల్ ఓపెనింగ్స్..
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన భగవంత్ కేసరికి మొదటి రోజు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. విజయ్ లియో సినిమాకు సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయి. ముంబై వీధుల్లో కొన్నేళ్లుగా మాస్క్ వేసుకుని కనిపించిన వ్యక్తి రాజ్ కుంద్రా. సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన సినిమా మామా మశ్చీంద్ర. 'లగాన్', 'పానిపట్', 'జోదా అక్బర్' లాంటి గొప్ప చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు అశుతోష్ గోవారికర్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Oct 21, 2023 | 4:15 PM

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన భగవంత్ కేసరికి మొదటి రోజు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ డే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 32 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు తెలిపారు దర్శక నిర్మాతలు. వీరసింహారెడ్డి కంటే ఇది తక్కువ కలెక్షన్లే అయినా కూడా.. లియోతో పోటీ ఉండటంతో సగానికి పైగా థియేటర్స్ తక్కువయ్యాయి. దాంతో కలెక్షన్స్ కూడా కాస్త తగ్గాయి.

విజయ్ లియో సినిమాకు సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు అందరి అంచనాలు నిలబెడుతూ ఈ చిత్రం దాదాపు 120 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. ఫైనల్ ఫిగర్స్ ఇంకా బయటికి రాలేదు. కచ్చితంగా ఆదిపురుష్, జవాన్ సినిమాలను దాటేసి ఉంటుందని అంచనా. వీకెండ్ ముగిసేనాటికి లియో సంచలనాలు ఎలా ఉంటాయో చూడాలి.

ముంబై వీధుల్లో కొన్నేళ్లుగా మాస్క్ వేసుకుని కనిపించిన వ్యక్తి రాజ్ కుంద్రా. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త ఈయన. ఆ మధ్య బ్లూ ఫిల్స్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన దగ్గర నుంచి కుంద్రా అలాగే తిరుగుతున్నా డు. ఈనేపథ్యంలోనే ట్వీట్‌లో విడాకులు అంటూ ప్రస్థావించాడు అయితే ఆయన విడిపోయేది మాస్క్‌తోనా లేదంటే శిల్పాతోనా అనేది సస్పెన్స్ మెయింటేన్ చేసి ఆ తర్వాత క్లారిటీ ఇచ్చాడు. తన బయోపిక్‌లో తానే నటిస్తున్నాడు. దానికి UT69 టైటిల్ పెట్టారు.

సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన సినిమా మామా మశ్చీంద్ర. హర్షవర్ధన్ తెరకెక్కించిన ఈ సినిమా రెండు వారాల కిందే థియేటర్స్‌లో విడుదలైంది. తాజాగా ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ట్రిపుల్ రోల్ చేసాడు సుధీర్ బాబు. ఈ సినిమాలో మృణాళిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటించారు.

'లగాన్', 'పానిపట్', 'జోదా అక్బర్' లాంటి గొప్ప చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు అశుతోష్ గోవారికర్. దర్శకుడిగానే కాదు నటుడిగానూ మెప్పించారీయన. 'హోలి' నుంచి 'వెంటిలేటర్' వరకూ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. తాజాగా ఆయన మరో సర్వైవల్ డ్రామాతో వస్తున్నారు. 'కాలాపాని' అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమీర్ సక్సెనా తెరకెక్కిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత అశుతోశ్ గోవారికర్ నటిస్తున్న చిత్రం ఇదే.





























