నిన్నమొన్నటిదాకా శ్రీలీల అనే పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేవి ఒన్లీ కమర్షియల్ సినిమాలు మాత్రమే. కానీ ఇప్పుడు లెక్క మారింది. భగవంత్ కేసరిలో విజ్జి పాప కేరక్టర్ చూసిన వారందరూ ఈలలేస్తున్నారు.నందమూరి బాలకృష్ణతో పోటీపడి స్క్రీన్ మీద సన్నివేశాలను పండించడం అంత తేలిక కాదు. అలాంటిది విజ్జీ పాప కేరక్టర్‌లో శ్రీలీల కేక పెర్ఫార్మెన్స్ ఇచ్చారని మెచ్చుకుంటున్నారు. అనిల్‌రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా భగవంత్ కేసరి.