AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs PAK: ‘టీమిండియాపైనే ఓడిపోతారా.. పరువు పోయింది.. అడుక్కునైనా రూ. 50 లక్షలు కట్టండి..’

టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైనందుకు పీసీబీ ఆటగాళ్లపై భారీ జరిమానా విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కొక్క ఆటగాడు రూ. 50 లక్షలు కట్టాలని పీసీబీ ప్రెసిడెంట్ నఖ్వీ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిపై మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

IND Vs PAK: 'టీమిండియాపైనే ఓడిపోతారా.. పరువు పోయింది.. అడుక్కునైనా రూ. 50 లక్షలు కట్టండి..'
Pakistan Cricket
Ravi Kiran
|

Updated on: Mar 03, 2026 | 1:55 PM

Share

టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు నిరాశాజనకమైన ప్రదర్శనతో ఇంటిదారి పట్టింది. సూపర్ 8 దశ వరకు చేరుకున్నప్పటికీ, కీలక మ్యాచ్‌లలో ఓడిపోయి సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ దారుణ వైఫల్యం తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆటగాళ్లపై కఠినమైన చర్యలకు ఉపక్రమించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, పీసీబీ గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓడిపోయినందుకు గానూ, ప్రతి ఆటగాడికి 50 లక్షల పాకిస్తాన్ రూపాయల(భారత కరెన్సీలో సుమారు 16 లక్షలు) భారీ జరిమానా విధించింది. ఈ జరిమానాను చెల్లించడంలో విఫలమైతే జట్టు నుంచి తొలగిస్తామని కూడా పీసీబీ హెచ్చరించినట్లు తెలుస్తోంది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి.

పీసీబీ నిర్ణయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. మొహ్సిన్ నఖ్వీ తీరును ప్రశ్నిస్తూ, “ఆటగాళ్లు 50 లక్షలు కట్టడం ఎక్కడైనా ఉందా? పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ బుర్ర పనిచేస్తోందా.?” అని మండిపడ్డారు. కొత్త నిబంధనలు తీసుకువచ్చి పాకిస్తాన్ క్రికెట్ వ్యవస్థను నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. 50 లక్షల రూపాయల కోసం ఆటగాళ్లు ఎక్కడికి వెళ్ళాలని, డబ్బులు చెట్లకు కాస్తున్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ఆడకపోతే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి గానీ, డబ్బులు వసూలు చేయడం సరికాదని మాజీలు విమర్శించారు.

ఆటగాళ్ల ప్రదర్శన సరిగ్గా లేకపోతే ఒక్కొక్కరిపై రెండు సంవత్సరాల పాటు వేటు వేయాలని సూచించారు. అలాంటి కఠిన చర్యల ద్వారా మాత్రమే పాకిస్తాన్ ఆటగాళ్లు సరైన దారిలోకి వస్తారని పేర్కొన్నారు. పాకిస్తాన్ జట్టులో ఈ విధమైన సంక్షోభం నెలకొన్న వేళ, టీమిండియా టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తోంది. సూపర్ 8లోని తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించి సెమీ-ఫైనల్స్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది. అంతేకాకుండా, మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇది చదవండి: ఇక వార్ వన్‌సైడేరోయ్.! సెమీస్‌కు ముందే టీమిండియాకు 5 గుడ్‌న్యూస్‌లు..

Follow Us
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
ధోనీ, కోహ్లీ, సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాకే
ధోనీ, కోహ్లీ, సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాకే
కులపెద్దతో గొడవ పడ్డాడని దారుణంగా కొట్టి చంపిన కులస్తులు!
కులపెద్దతో గొడవ పడ్డాడని దారుణంగా కొట్టి చంపిన కులస్తులు!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర