AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ROKO : ఫామ్‌లోకి రావడానికి టైమ్ లేదు.. రోహిత్, కోహ్లీకి మాజీ క్రికెటర్ అల్టిమేటం

ROKO : వచ్చే వన్డే వరల్డ్‌కప్ ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్ నుంచే ఫామ్ చూపించాలని మాజీ క్రికెటర్ దీప్ దాస్‌ గుప్తా వ్యాఖ్యానించారు. ఒకే ఫార్మాట్ ఆడుతున్నందున వారిపై ఒత్తిడి మరింత పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ROKO : ఫామ్‌లోకి రావడానికి టైమ్ లేదు.. రోహిత్, కోహ్లీకి మాజీ క్రికెటర్ అల్టిమేటం
Roko (1)
Rakesh
|

Updated on: Jul 28, 2026 | 11:06 AM

Share

ROKO : టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల క్రికెట్ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ సాగుతోంది. ఇప్పటికే పొట్టి ఫార్మాట్ అయిన టీ20లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు, ఆ తర్వాత టెస్టు ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరూ భారత్ తరఫున కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌ను విజేతగా నిలపడమే లక్ష్యంగా వీరు ముందుకు సాగుతున్నారు. అయితే ఈ మెగా టోర్నీ వరకు వీరిద్దరూ జట్టులో కొనసాగుతారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే లార్డ్స్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ వైదొలుగుతారనే వార్తలు వచ్చినా, అవి కార్యరూపం దాల్చలేదు.

తొలి మ్యాచ్ నుంచే ఫామ్ చూపించాలి

ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్, ప్రముఖ కామెంటర్ దీప్ దాస్‌గుప్తా తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “రోహిత్, కోహ్లీలు ఫామ్‌లోకి రావడానికి ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు సమయం తీసుకోకూడదు. సిరీస్ ఆరంభం నుంచే, అంటే మొదటి మ్యాచ్ నుంచే తమ అద్భుత ఫామ్‌ను కనబరచాలి. టీమ్ సపోర్ట్ స్టాఫ్ పాత్ర ఇక్కడ చాలా కీలకం. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేలా డ్రెస్సింగ్ రూమ్‌లో సరైన వాతావరణాన్ని సృష్టించాలి” అని ఆయన స్పష్టం చేశారు.

స్థానం కోసం ప్రతిసారీ చెప్పాల్సిన పనిలేదు

జట్టులో రోహిత్, కోహ్లీల స్థానాల గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదని దాస్‌గుప్తా అభిప్రాయపడ్డారు. “నాలుగేళ్ల క్రితం ప్రతి సిరీస్‌కు ముందు వారు జట్టులో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. వారి గత ప్రదర్శనల ఆధారంగా జట్టులో వారి స్థానం ఎప్పుడూ ఖాయంగా ఉండేది. ఆ పద్ధతి ఇప్పుడు ఎందుకు మారాలి? మారకూడదు కూడా. మూడేళ్ల క్రితం వారితో యాజమాన్యం ఎలా వ్యవహరించేదో, ఇప్పుడు కూడా అలాగే వ్యవహరించాలి” అని పేర్కొన్నారు.

ఒకే ఫార్మాట్ ఆడడమే పెద్ద సవాలు

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై ఈ రకమైన చర్చలు పెరగడానికి ప్రధాన కారణం వారు కేవలం ఒకే ఒక్క ఫార్మాట్‌లో ఆడడమేనని దీప్ దాస్‌గుప్తా విశ్లేషించారు. “ఒక ఆటగాడు అనేక ఫార్మాట్లలో ఆడుతున్నప్పుడు.. ఒక ఫార్మాట్‌లో విఫలమైనా, మరో ఫార్మాట్‌లో రాణించి ఆ పాత వైఫల్యాన్ని దాటేయవచ్చు. కానీ కేవలం ఒకే ఫార్మాట్ ఆడుతున్నప్పుడు ప్రదర్శన సరిగాలేకపోతే తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇది వారిద్దరికీ నిజంగా పెద్ద సవాలే” అని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us