AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి సుమంత్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అక్కినేని హీరో సుమంత్ నటించిన ఈ మిస్టరీ డివోషనల్ థ్రిల్లర్ చిత్రం కొద్ది రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ కు రానుంది.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి సుమంత్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 01, 2026 | 5:48 PM

Share

అక్కినేని హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ మిస్టరీ డివోషనల్ థ్రిల్లర్ చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. గతంలో సుమంత్‌తోనే ‘సుబ్రహ్మణ్యపురం’ లాంటి డివోషనల్ థ్రిల్లర్ తెరకెక్కించిన సంతోష్ జాగర్లమూడినే ఈ సినిమాను రూపొందించాడు. అక్కినేని హీరోతో పాటు సిద్ధు జొన్నలగడ్డ మరో కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. వారాహి అమ్మవారి మహత్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఉన్నంతలో నిర్మాతలకు కూడా మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. ఐఎమ్ డీబీలోనూ మహేంద్ర గిరి వారాహి సినిమాకు మంచి రేటింగ్ దక్కింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. అది కూడా మరికొన్ని గంటల్లోనే. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. మహేంద్ర గిరి వారాహి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం (అక్టోబర్ 02) నుంచే సుమంత్ సినిమాను స్ట్రీమింగ్ కు రానుంది. అంటే థియేటర్లలో విడుదలైన 21 వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి రానుందన్నమాట. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ మహేంద్ర గిరి వారాహి సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.

రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా మహేంద్రగిరి వారాహి సినిమాను నిర్మించాయి. హీరో, హీరోయిన్లతో పాటు మాళవిక నాయర్, మంజు భార్గవి, బ్రహ్మానందం తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. మహేంద్ర గిరి వారాహి సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఒక రాజవంశాన్ని ఏళ్లుగా ఒక వింత శాపం వెంటాడుతుంటుంది. ఆ కుటుంబంలోని మగవాళ్లు 33 ఏళ్లు దాటగానే అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతుంటారు. అసలు ఈ శాపం ఎందుకు వచ్చింది? దాని వెనుక మహేంద్రగిరి వారాహి అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటి? అదే వంశానికి చెందిన సుమంత్ ఈ మిస్టరీని ఎలా కనుగొన్నాడన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్. మరి థియేటర్లలో మహేంద్రగిరి వారాహి సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి సుమంత్ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఆ రోజున ప్రారంభం..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఆ రోజున ప్రారంభం..
 చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా? తగ్గించుకోవాలంటే ఇలా చేయండి
 చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా? తగ్గించుకోవాలంటే ఇలా చేయండి
నూనె లేదు.. పొయ్యి అవసరం లేదు! కేవలం 5 నిమిషాల్లో ఉల్లి కారం రెడీ
నూనె లేదు.. పొయ్యి అవసరం లేదు! కేవలం 5 నిమిషాల్లో ఉల్లి కారం రెడీ
వారెవ్వా లక్కు అంటే వీరిదే.. దీపావళికి జాక్ పాట్ కొట్టే రాశులివే!
వారెవ్వా లక్కు అంటే వీరిదే.. దీపావళికి జాక్ పాట్ కొట్టే రాశులివే!
వాస్తు : ఇంటి ముందు నిమ్మ చెట్టు ఉండటం మంచిదేనా?
వాస్తు : ఇంటి ముందు నిమ్మ చెట్టు ఉండటం మంచిదేనా?
ఉదయం టిఫిన్‌ సమయంలో లెమన్ రైస్ తినొచ్చా?
ఉదయం టిఫిన్‌ సమయంలో లెమన్ రైస్ తినొచ్చా?
 టమాటాలు త్వరగా పాడవుతున్నాయా? ఫ్రిజ్‌లో పెట్టే ముందు ఈ చిట్కాలు
 టమాటాలు త్వరగా పాడవుతున్నాయా? ఫ్రిజ్‌లో పెట్టే ముందు ఈ చిట్కాలు
 లిప్ బామ్ వాడినా పెదాలు పగులుతున్నాయా? ఈ జాగ్రత్తలు తీసుకోండి!
 లిప్ బామ్ వాడినా పెదాలు పగులుతున్నాయా? ఈ జాగ్రత్తలు తీసుకోండి!
మీ పాన్ కార్డు ఇతరులు ఉపయోగిస్తే తెలుసుకోవడం ఎలా..?
మీ పాన్ కార్డు ఇతరులు ఉపయోగిస్తే తెలుసుకోవడం ఎలా..?
  ఫోన్‌లు, టీవీలతోనే పిల్లల కాలక్షేపమా? ఎముకల ఆరోగ్యంపై జాగ్రత్త
  ఫోన్‌లు, టీవీలతోనే పిల్లల కాలక్షేపమా? ఎముకల ఆరోగ్యంపై జాగ్రత్త