Bigg Boss 7 Telugu: ఎక్కడో సుడి ఉంది.. 8 వారాలుగా నామినేషన్స్‌ నుంచి భలే తప్పించుకుంటున్నాడుగా.. ఎవరో తెలుసా?

ఈ సీజన్‌లో ఒక కంటెస్టెంట్స్‌ నామినేషన్స్‌ భలే తప్పించుకుంటున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 వారాలకు పైగా నామినేషన్స్‌లో అతని పేరు కనిపించడం లేదు. తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇంతకీ నామినేషన్స్‌ నుంచి తప్పించుకుంటోన్న ఆ కంటెస్టెంట్‌ మరెవరో కాదు

Bigg Boss 7 Telugu: ఎక్కడో సుడి ఉంది.. 8 వారాలుగా నామినేషన్స్‌ నుంచి భలే తప్పించుకుంటున్నాడుగా.. ఎవరో తెలుసా?
Bigg Boss Season 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Oct 20, 2023 | 8:58 PM

తెలుగు బిగ్గెస్ట్‌ టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇప్పటికే ఎనిమిదో వారం వీకెండ్‌కు చేరుకుందీ సెలబ్రిటీ గేమ్‌ షో. పాత కంటెస్టెంట్లు, కొత్త కంటెస్టెంట్స్‌తో కలిసి మొత్తం 13 మంది హౌజ్‌లో కొనసాగుతున్నారు. కాగా ఈ సీజన్‌లో ఒక కంటెస్టెంట్స్‌ నామినేషన్స్‌ భలే తప్పించుకుంటున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 వారాలకు పైగా నామినేషన్స్‌లో అతని పేరు కనిపించడం లేదు. తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇంతకీ నామినేషన్స్‌ నుంచి తప్పించుకుంటోన్న ఆ కంటెస్టెంట్‌ మరెవరో కాదు ఆట సందీప్‌. కాగా ఉల్టా పుల్టా అంటూ ఏడో సీజన్‌ను ప్రారంభించిన బిగ్‌ బాస్‌ మొదటి ఐదు వారాల పాటు కెప్టెన్సీ టాస్కులేమీ పెట్టలేదు. కేవలం నామినేషన్స్‌ నుంచి తప్పించుకోవడానికే టాస్కులు, గేమ్స్‌లు ఆడించారు. అలా మొదటి వారంలోనే ఆట సందీప్‌ పవరాస్త్రను సాధించాడు. దీంతో ఐదు వారాల పాటు ఇమ్యూనిటీ సాధించిన అతను నామినేషన్స్‌కు దూరంగా ఉండిపోయాడు. అంతేకాదు బిగ్‌ బాస్‌ హౌజ్‌ మేట్‌గా కూడా ఉండిపోయాడు. ఇక ఐదు వారాల తర్వాతైనా సందీప్‌ నామినేషన్స్‌ లిస్టులోకి వస్తాడని చాలా మంది భావించారు.

అలా అనుకున్నట్లుగానే ఆరో వారం ఆట సందీప్ నామినేషన్స్ లోకి వచ్చాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అదేంటంటే.. ముందు వారం ఎలిమినేట్‌ అయిన గౌతమ్‌ సీక్రెట్‌ రూమ్‌లో ఉండి అప్పుడే బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌ బాస్‌ ఇచ్చిన పవర్‌తో సందీప్‌ను నామినేషన్స్‌ నుంచి రక్షించాడు. అలా ఆరో వారం కూడా సందీప్‌ నామినేషన్స్‌లోకి వెళ్లలేదు. ఇక ఏడో వారంలో బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి కొత్త కంటెస్టెంట్స్‌ వచ్చారు. చాలా మంది వారికే నామినేషన్స్‌ వేశారు. కేవలం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు మాత్రమే నామినేషన్స్‌లో ఓటు వేశారు. అయితే కేవలం ఒక్క ఓటు మాత్రమే పడడతో ఏడో వారంలో కూడా సందీప్‌ నామినేషన్స్‌లోకి రాకుండా తప్పించుకున్నాడు. ఇక ఎనిమిదో వారం కచ్చితంగా నామినేషన్స్‌లో ఉంటాడనుకున్న సమయంలో అనూహ్యంగా కెప్టెన్సీ టాస్క్‌లో విజయం సాధించాడు సందీప్‌.

ఇవి కూడా చదవండి

హౌజ్ కెప్టెన్ గా సందీప్..

దీంతో వచ్చే వారం కూడా సందీప్ ని నామినేట్ చేయడానికి కంటెస్టెంట్లకు ఏ మాత్రం అవకాశం లేదు. మొత్తానికి 8 వారాలకు పైగా నామినేషన్స్‌లోకి రాకుండా భలే తప్పించుకుంటున్నాడు డ్యాన్స్‌ మాస్టర్‌. కాగా తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలో 8 వారాలకు పైగా నామినేషన్స్‌ నుంచి తప్పించుకోవడం ఇదే మొదటిసారి.

బిగ్ బాస్ చరిత్రలోనే మొదటి సారిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..