Yatra 2 Movie: జనంతో జగన్‌.. ‘యాత్ర 2’ నుంచి మరో పవర్‌ఫుల్‌ పోస్టర్‌ రిలీజ్.. జీవా జీవించేశాడుగా

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ తెరకెక్కించిన చిత్రం యాత్ర. 2019 ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన ఈ పొలిటికల్‌ డ్రామా సూపర్‌ హిట్‌గా నిలిచింది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి జీవించారు.

Yatra 2 Movie: జనంతో జగన్‌.. 'యాత్ర 2' నుంచి మరో పవర్‌ఫుల్‌ పోస్టర్‌ రిలీజ్.. జీవా జీవించేశాడుగా
Yatra 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 18, 2023 | 5:40 PM

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ తెరకెక్కించిన చిత్రం యాత్ర. 2019 ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన ఈ పొలిటికల్‌ డ్రామా సూపర్‌ హిట్‌గా నిలిచింది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి జీవించారు. అలాగే రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, వైఎస్సార్ స్నేహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సూపర్‌ హిట్‌గా నిలిచిన యాత్ర సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ కూడా వస్తోంది. యాత్ర 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో వైఎస్సార్‌ తో పాటు ఆయన తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాత్ర ఉండనుంది. ప్రముఖ తమిళ నటుడు జీవా వైఎస్‌ జగన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే యాత్ర 2 కు సంబంధించిన జీవా ఫస్ట్‌ లుక్‌ విడుదలై సెన్సేషన్‌ సృష్టించింది. తాజాగా ఇదే సినిమా నుంచి జీవా రోల్‌కు సంబంధించి మరొక పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌

వైఎస్ జగన్ పాత్రను పోషిస్తోన్న జీవా జనం మధ్యలో ఉండి వారి బాగోగులు తెలుసుకుంటూ కనిపించారు ఈ కొత్త పోస్టర్‌లో. దీన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్న మహి.వి. రాఘవ్‌ ‘ జగన్‌ క్యారెక్టర్‌లో జీవా జీవించాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటారు. నాతో ఏకీభవిస్తారు’ అని రాసుకొచ్చాడు. కాగా యాత్ర మాదిరిగానే యాత్ర 2 కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. కాగా వైఎస్సార్‌ మరణం తర్వాతి పరిణామాలు అంటే వైఎస్‌ జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం, పాదయాత్ర, భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠం చేపట్టడం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం తదితర అంశాలను యాత్ర 2 లో చూపించనున్నట్లు పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూర్చనున్నారు.

ఇవి కూడా చదవండి

జనం మధ్య జగన్..

View this post on Instagram

A post shared by Mahi V Raghav (@mahivraghav)

ఫిబ్ర వరి 8 న గ్రాండ్ రిలీజ్..

View this post on Instagram

A post shared by Mahi V Raghav (@mahivraghav)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..