Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: తగ్గేదేలే.. నేషనల్‌ అవార్డ్‌ రెడ్‌ కార్పెట్‌పై అల్లు అర్జున్‌.. జాతీయ అవార్డుపై ఏమన్నారంటే?

70 ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాస్తూ మరికొన్ని క్షణాల్లో జాతీయ ఉత్తమ నటుడి అవార్డును హీరో అల్లు అర్జున్‌ అందుకుంటున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, సూర్య, ధనుష్‌, శింబు, ఆర్య, జోజు జార్జ్‌ పోటీపడ్డారు. వాళ్లందర్నీ వెనక్కు నెడుతూ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తగ్గేదే లే అంటూ ఈ అవార్డు సాధించారు. మరికొన్ని క్షణాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బన్నీ  ఈ అవార్డు అందుకోనున్నాడు

Allu Arjun: తగ్గేదేలే.. నేషనల్‌ అవార్డ్‌ రెడ్‌ కార్పెట్‌పై అల్లు అర్జున్‌.. జాతీయ అవార్డుపై ఏమన్నారంటే?
Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Oct 17, 2023 | 3:19 PM

70 ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాస్తూ మరికొన్ని క్షణాల్లో జాతీయ ఉత్తమ నటుడి అవార్డును హీరో అల్లు అర్జున్‌ అందుకుంటున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, సూర్య, ధనుష్‌, శింబు, ఆర్య, జోజు జార్జ్‌ పోటీపడ్డారు. వాళ్లందర్నీ వెనక్కు నెడుతూ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తగ్గేదే లే అంటూ ఈ అవార్డు సాధించారు. మరికొన్ని క్షణాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బన్నీ  ఈ అవార్డు అందుకోనున్నాడు . కాగా ఇదే పుష్ప 1 సినిమాకు బెస్ట్‌ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్‌కు జాతీయ అవార్డ్‌లు దక్కాయి. జాతీయ అవార్డు అందుకోవడానికి సోమవారం (అక్టోబర్ 16) కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లాడు అల్లు అర్జున్‌. ఇక ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకునే ముందు రెడ్‌ కార్పెట్‌పై డీడీ నేషనల్‌ ఛానెల్‌లో మాట్లాడాడు ఐకాన్‌ స్టార్‌. పుష్పలాంటి ఓ కమర్షియల్ సినిమాకు ఈ అవార్డు అందుకోవడం తనకు డబుల్ అచీవ్‌మెంట్‌ లాంటిదన్నారు. ‘అవార్డు అందుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇదో గొప్ప గౌరవం. అందులోనూ ఓ కమర్షియల్ సినిమాకు ఈ అవార్డు అందుకోవడం నాకు డబుల్ అచీవ్ మెంట్’ అని అల్లు అర్జున్‌ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పుష్ప ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్‌ చెప్పాలని ఛానెల్‌ ప్రతినిధులు కోరగా.. ‘తగ్గేదేలే’ అంటూ తన దైన స్టైల్‌లో చెప్పాడు బన్నీ.

ఆర్ఆర్ఆర్ మూవీ వేర్వేరు విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ హోల్‌సేల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంతో పాటు ఉత్తమ కొరియోగ్రఫీ, యాక్షన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగాల్లో సత్తా చాటింది. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్‌గా తెలుగు నుంచి పురుషోత్తమచార్యులు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో అత్యధిక ప్రజాదరణ పొందిన RRR చిత్రంగా ఎంపికైంది. అటు జాతీయ ఉత్తమ చిత్రంగా మాధవన్ హీరోగా నటించిన రాకేట్రి.. ది నంబి ఎఫెక్ట్ ఎంపికైంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేయడంతో పాటు జాతీయ అవార్డు దక్కడం గొప్ప గౌరవమన్నారు దర్శకుడు రాజమౌళి. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన అవార్డ్‌ అందుకుంటోంది. కొండపొలం చిత్రంలోని పాటకు చంద్రబోస్ జాతీయ అవార్డు అందుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

స్టైలిష్ సూట్ లో తళుక్కుమన్న ఐకాన్ స్టార్..

జాతీయ అవార్డుల ప్రదానోత్సవం .. లైవ్ వీడియో..

మరిన్నిసినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..