AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఛైల్డ్‌ ఆర్టిస్టు నుంచి స్టార్ హీరోయిన్‌ దాకా.. సౌత్‌ ఇండస్ట్రీని ఏలేస్తోంది.. ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? సినిమాలు ఎక్కువగా చూసే వారు అయితే పోలికలు చూసి ఇట్టే గుర్తుపడతారు. అంతలా నటనతో చెరగని ముద్ర వేసుకుందీ అందాల తార. ఛైల్డ్‌ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది.

Actress: ఛైల్డ్‌ ఆర్టిస్టు నుంచి స్టార్ హీరోయిన్‌ దాకా.. సౌత్‌ ఇండస్ట్రీని ఏలేస్తోంది.. ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Oct 16, 2023 | 7:35 PM

Share

ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? సినిమాలు ఎక్కువగా చూసే వారు అయితే పోలికలు చూసి ఇట్టే గుర్తుపడతారు. అంతలా నటనతో చెరగని ముద్ర వేసుకుందీ అందాల తార. ఛైల్డ్‌ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఓవైపు స్టార్‌ హీరోల సినిమాల్లో గ్లామరస్‌ పాత్రలు పోషిస్తూనే.. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు సై అంటుందామె. అందుకే సౌత్‌ ఇండియన్‌ ఇండస్ట్రీలో ఇప్పుడామె ఒక క్రేజీ హీరోయిన్‌. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ అభినయానికి జాతీయ అవార్డు కూడా దాసోహమైంది. ఈ పాటికే అర్ధమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. యస్‌.. ఈ ఫొటోలోని చిన్నారి మరెవరో కాదు మహానటి, అభినవ సావిత్రి కీర్తి సురేష్‌. మంగళవారం (అక్టోబర్‌ 17) కీర్తి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి, అరుదైన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పై ఫొటో కూడా అందులోదే. ఇందులో చిన్నప్పుడే మేకప్‌ వేసుకుంటూ ఎంతో క్యూట్‌గా కనిపించింది కీర్తి సురేష్‌. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

కాగా ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాల్లో నటించింది కీర్తి సురేష్. నాని దసరా, ఉదయనిధి స్టాలిన్‌ మామాన్నన్‌ సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించిన ఈ మహానటి ‘భోళాశంకర్‌’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సోదరిగా కనిపించింది. ప్రస్తుతం ఆమె జయం రవి సరసన సైరన్‌ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో అనుపమ, సముద్ర ఖని, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోసించారు. దీంతో పాటు రివాల్వర్‌ రీటా అనే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలోనూ కనపించనుంది కీర్తి. వీటితో పాటు రఘుతాత, కన్నెవెడీ అనే తమిళ సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

కీర్తి సురేష్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్ చూశారా?

డైరెక్టర్ అట్లీ సతీమణితో కీర్తి డ్యాన్స్..

మెగా స్టార్ తో మహానటి ..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత
నవరాత్రుల ఏడో రోజు అమ్మవారి కాలరాత్రి రూపం.. పూజా విధానం..
నవరాత్రుల ఏడో రోజు అమ్మవారి కాలరాత్రి రూపం.. పూజా విధానం..
కిక్ సినిమాలో నటించిన ఈ భామ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా
కిక్ సినిమాలో నటించిన ఈ భామ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా
రెండు మూడు సినిమాలతో కనిపించకుండా మాయం అయ్యింది..
రెండు మూడు సినిమాలతో కనిపించకుండా మాయం అయ్యింది..
అప్పట్లో ఊపేసింది.. ఇప్పుడు కనిపించకుండా మాయం అయ్యింది
అప్పట్లో ఊపేసింది.. ఇప్పుడు కనిపించకుండా మాయం అయ్యింది
బయట కొన్నట్లే ఎర్రగా, క్రిస్పీగా గోబీ 65.. సింపుల్ రెసిపీ ఇదిగో!
బయట కొన్నట్లే ఎర్రగా, క్రిస్పీగా గోబీ 65.. సింపుల్ రెసిపీ ఇదిగో!