- Telugu News Photo Gallery Cinema photos Sai Dharam Tej celebrates birthday with a big heart, donates Rs 20 lakh to soldiers and police
Sai Dharam Tej: మామల బాటలోనే మేనల్లుడు.. అమరవీరుల కుటుంబాలకు, పోలీసులకు రూ. 20 లక్షల విరాళం
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇవాళ (అక్టోబర్ 15) పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ మెగా హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ సాయి ధరమ్ తేజ్‌పేరు మార్మోగిపోతోంది.
Updated on: Oct 15, 2023 | 10:05 PM

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇవాళ (అక్టోబర్ 15) పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ మెగా హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ సాయి ధరమ్ తేజ్‌పేరు మార్మోగిపోతోంది.

కాగా తన పుట్టిన రోజున గొప్ప మనసును చాటుకున్నాడు సాయి ధరమ్ తేజ్. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆర్మీ అధికారుల భార్యలకు రూ.10 లక్షలు.. అలాగే ఏపీ-తెలంగాణ పోలీసులకు రూ.10 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు.

ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్‌నే సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ' నేను తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంలో మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. అయితే అది మీ విరాళాల రూపంలో కాదు. సైనికులు, ఆర్మీ, పోలీసులు మనకోసం చేస్తున్న పనికి మీరు చూపించే అభిమానం, గౌరవం రూపంలో’ అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.

అలాగే తన లాగానే ఇతరులు కూడా సైనికులకు, పోలీసులకు, వారు పడే కష్టాలకు కాస్త మర్యాద ఇచ్చిన చాలు అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

సాయి ధరమ్ తేజ్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన నిర్ణయంతో పుట్టిన రోజును మధురానుభూతిగా మార్చుకున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.