- Telugu News Photo Gallery Cinema photos Highest Paid Actors: Prabhas to Allu Arjun These are highest paid actors from South India Film Industry
Highest Paid Actors: ఒక్కో మువీకి ఈ హీరోలు ఎంతెంత పారితోషికం తీసుకుంటారో తెలుసా?
దక్షిణాది సినిమాలు వరుస హిట్‌లతో దూసుకుపోతున్నాయి. ఇక ఆ సినిమాల్లో నటించే స్టార్‌లు ఒక్కో సినిమాకు కోట్లలో పరితోషికాలు అందుకుంటున్నారు. రజనీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు వీరి పరితోషికాలు తెలిస్తే నోరెళ్ల బెడతారు. ముందుగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసుకుందాం.. దక్షిణాదిన తలైవాగా పేరు తెచ్చుకున్న ఈ సీనియర్ హీరో ఒక్కో సినిమాకు రెమ్మునరేషన్‌గా అక్షరాల రూ.125 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం..
Updated on: Oct 15, 2023 | 8:13 PM

దక్షిణాది సినిమాలు వరుస హిట్‌లతో దూసుకుపోతున్నాయి. ఇక ఆ సినిమాల్లో నటించే స్టార్‌లు ఒక్కో సినిమాకు కోట్లలో పరితోషికాలు అందుకుంటున్నారు. రజనీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు వీరి పరితోషికాలు తెలిస్తే నోరెళ్ల బెడతారు. ముందుగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసుకుందాం.. దక్షిణాదిన తలైవాగా పేరు తెచ్చుకున్న ఈ సీనియర్ హీరో ఒక్కో సినిమాకు రెమ్మునరేషన్‌గా అక్షరాల రూ.125 కోట్లు తీసుకుంటున్నాడు.

రజనీ తర్వాత దక్షిణాదిన అత్యంత ప్రజాదరణ పొందిన హీరో కమల్ హాసన్, 60 ఏళ్లుగా సినీదునియాని ఏలుతున్న కమల్ ఒక్కో సినిమాకు 75 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. హీరో అజిత్ ఒక్కో సినిమాకు 105 కోట్లు తీసుకుంటాడట. అజితో సినిమాలతో పాటు బైక్ రైడింగ్‌లోనూ బాగానే అర్జిస్తున్నట్లు టాక్.

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా మారిపోయింది. మొదట్లో తన రెమ్యునరేషన్ తక్కువగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు 75 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం.

బాహుబలి నుంచి సాహో వరకు సినీ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన హీరో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగ చెప్పనవసరం లేదు. ప్రభాస్ ఒక్కో సినిమాకు ఏకంగా 100 కోట్లు తీసుకున్నాడని టాక్.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కూడా దక్షిణాదిన యమ క్రేజ్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గతంలో ఒక్కో సినిమాకి 40-45 కోట్ల రూపాయలు తీసుకుంటున్నప్పటికీ RRR తర్వాత అది రూ.100 కోట్లకు పెంచినట్లు సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించిన మరో హీరో రామ్ చరణ్ కూడా ఒక్కో సినిమాకు 100 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. అయితే రామ్ చరణ్ మత్రం రూ.15 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నట్లు తెలిపారు.





























