AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇందులో కనిపిస్తోన్న టాలీవుడ్‌ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? ఈ పేరు వింటే ఫ్యాన్స్‌కు పూనకాలే..

గత కొన్ని రోజులుగా ఏఐ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ సహాయంతో రీక్రేయేట్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. చిరంజీవి, ఎన్టీఆర్‌, పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌, మహేశ్‌ బాబు వంటి స్టార్‌ హీరోలతో పాటు రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ, ఎంఎస్‌ ధోని వంటి స్టార్‌ క్రికెటర్ల ఏఐ ఇల్యూషన్‌ ఫొటోలు తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. అలా ఇప్పుడు మరొక స్టార్‌ హీరో ఏఐ ఇల్యూషన్‌ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

Tollywood: ఇందులో కనిపిస్తోన్న టాలీవుడ్‌ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? ఈ పేరు వింటే ఫ్యాన్స్‌కు పూనకాలే..
Tollywood Actor
Basha Shek
|

Updated on: Oct 15, 2023 | 5:12 PM

Share

ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా టీవల కాలంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ పేరు బాగా వినిపిస్తోంది. అన్ని రంగాల్లోనూ ఈ కృత్రిమ మేథస్సు ప్రభావం కనిపిస్తోంది. అలా ఈ మధ్యన ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకొని కొంతమంది ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలను, స్టార్‌ క్రికెటర్లను డిఫరెంట్ బ్యాగ్రౌండ్ లో అద్బుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఏఐ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ సహాయంతో రీక్రేయేట్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. చిరంజీవి, ఎన్టీఆర్‌, పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌, మహేశ్‌ బాబు వంటి స్టార్‌ హీరోలతో పాటు రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ, ఎంఎస్‌ ధోని వంటి స్టార్‌ క్రికెటర్ల ఏఐ ఇల్యూషన్‌ ఫొటోలు తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. అలా ఇప్పుడు మరొక స్టార్‌ హీరో ఏఐ ఇల్యూషన్‌ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇందులో కార్‌ షెడ్డును నిశీతంగా పరిశీలిస్తే ఒక టాలీవుడ్ స్టార్‌ హీరో ముఖం మనకు కనిపిస్తుంది. మరి ఇందులో ఉన్నదెవరో గుర్తుపట్టారా? ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో స్టార్‌గా ఎదిగిన ఈ హీరోకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ముఖ్యంగా మాస్‌ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇప్పటివరకు టాలీవుడ్‌కే పరిమితమైన ఈ స్టార్‌ హీరో త్వరలో ఓ పాన్‌ ఇండియా సినిమాతో మన ముందుకు రానున్నారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో.. యస్‌. అతను మరెవరో కాదు మాస్‌ మహరాజా.

ధమాకా, వాల్తేరు వీరయ్యలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ అందుకున్న రవితేజకు రావణాసుర రిజల్ట్‌ తీవ్రంగా నిరాశపర్చింది. అందుకే మళ్లీ తన రేంజ్‌ హిట్ కొట్టేందుకు టైగర్‌ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న టైగర్ నాగేశ్వర రావు సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 20న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్‌ కానంది. వంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ సరసన నపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు, అనుపమ్‌ ఖేర్‌, రేణు దేశాయ్‌, జిషు సేన్‌ గుప్తా, మురళీ శర్మ, హరీష్‌ ,నాసర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన టైగర్‌ నాగేశ్వరరావుకు జీవీ ప్రకాష్‌ కుమార్‌ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

శిల్పాశెట్టితో రవితేజ డ్యాన్స్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us