Kasargold OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. కాసర్ గోల్డ్ తెలుగు స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ప్రముఖ ఓటీటీ సంస్థలు మలయాళ సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసి మరీ విడుదల చేస్తున్నాయి. అలాగే గతంలో థియేటర్లలో రిలీజై సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమాల తెలుగు వెర్షన్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌. 2018, పద్మినీ, జర్నీ ఆఫ్‌ 18 ప్లస్.. అలాగే ఇటీవల ఆర్‌డీఎక్స్‌ సినిమాలకు ఓటీటీలో సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడీ ఇదే కోవలో మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌  ఓటీటీలోకి వచ్చింది.

Kasargold OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. కాసర్ గోల్డ్ తెలుగు స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Kasargold Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 14, 2023 | 9:03 AM

క్రైమ్‌, కామెడీ, సస్పెన్స్, హార్రర్, థ్రిల్లర్‌.. ఏ జోనరైనా మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్‌, స్పెషాలిటీనే వేరు. ఎలాంటి నాటకీయత లేకుండా సహజత్వానికి, ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసే ఈ మాలీవుడ్‌ సినిమాలకు ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ముఖ్యంగా ఓటీటీ ఆడియెన్స్‌ ఈ సినిమాలకు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. అందుకే ప్రముఖ ఓటీటీ సంస్థలు మలయాళ సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసి మరీ విడుదల చేస్తున్నాయి. అలాగే గతంలో థియేటర్లలో రిలీజై సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమాల తెలుగు వెర్షన్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌. 2018, పద్మినీ, జర్నీ ఆఫ్‌ 18 ప్లస్.. అలాగే ఇటీవల ఆర్‌డీఎక్స్‌ సినిమాలకు ఓటీటీలో సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడీ ఇదే కోవలో మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌  ఓటీటీలోకి వచ్చింది. సెప్టెంబర్‌ 15న థియేటర్లలో విడుదలైన కాసర్‌ గోల్డ్‌ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ గా నిలిచింది. ఒక రాజకీయ నాయకుడు స్మగ్లింగ్ చేయిస్తున్న బంగారం పోవడం .. ఆ బంగారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి అతని అనుచరులు ప్రయత్నించడం.. ఇలా ఎంతో ఎంగేజింగ్‌గా సాగే కాసర్‌ గోల్డ్‌ సినిమా మలయాళంలో భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడీ సూపర్‌ హిట్‌ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో కాసర్‌ గోల్డ్‌ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

మృదుల్‌ నాయర్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో జైలర్‌ విలన్‌ వినాయకన్‌ ఓ కీలక పాత్రలో మెరవడం విశేషం. ఇందులో అతను రాజకీయనాయకుడికి కొమ్ముగాసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్నాడు.అలాగే అసిఫ్‌ అలీ, సన్నీవేలన్‌, సిద్ధిఖీ, సంపత్‌ రామ్, దీపక్‌ పారంబోల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.యూడ్లీ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై విక్రమ్‌ మెహ్రా, సిద్ధార్థ్‌ ఆనంద్‌ కాసర్‌ గోల్డ్‌ సినిమాను నిర్మించారు. విష్ణు విజయ్‌ స్వరాలు సమకూర్చారు. ఒక రాజకీయ నాయకుడు స్మగ్లింగ్ చేయాలనుకున్న బంగరాం చోరీ కావడం.. ఫైజల్‌ అనే గ్యాంగే ఈ పని చేసిందని అనుచరులు వెంట పడడం, మధ్యలో వినాయకన్‌ సహాయం తీసుకోవడం.. ఇలా ఎన్నో ట్విస్టులతో సాగుతుంది కాసర్‌ గోల్డ్‌ సినిమా. ఎమోషన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌, అక్కడక్కడా లవ్‌ ,రొమాన్స్‌.. ఇలా అన్నీ అంశాలు కాసర్‌ గోల్డ్ సినిమాలో ఉన్నాయి. వీకెండ్‌లో మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ చూడాలనుకునేవారికి ఈ మూవీ మంచి ఛాయిస్‌ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

కాసర్ గోల్డ్ మూవీ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..