Prem Kumar OTT: కడుపుబ్బా నవ్వించేందుకు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రేమ్‌ కుమార్‌’.. ఎక్కడ చూడొచ్చంటే?

సక్సెస్‌, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌. ఆసక్తికరమైన కథా, కథనాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు తన వంతు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆగస్టులో 'ప్రేమ్‌ కుమార్‌' గా మన ముందుకు వచ్చాడు. ప్రముఖ న‌టుడు, ర‌చ‌యిత అభిషేక్ మ‌హ‌ర్షి ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు.

Prem Kumar OTT: కడుపుబ్బా నవ్వించేందుకు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'ప్రేమ్‌ కుమార్‌'.. ఎక్కడ చూడొచ్చంటే?
Prem Kumar Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 13, 2023 | 12:39 PM

సక్సెస్‌, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌. ఆసక్తికరమైన కథా, కథనాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు తన వంతు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆగస్టులో ‘ప్రేమ్‌ కుమార్‌’ గా మన ముందుకు వచ్చాడు. ప్రముఖ న‌టుడు, ర‌చ‌యిత అభిషేక్ మ‌హ‌ర్షి ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించగా కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య, రాజ్ మాదిరాజు, ప్ర‌భావ‌తి త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీనికి తోడు సరైన ప్రమోషన్లు కూడా నిర్వహించకపోవడంతో బాక్సాఫీస్‌ దగ్గర పెద్ద క్లిక్‌ అవ్వలేదు. అయితే సినిమాలో యూత్‌ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. కామెడీకి కూడా ఏ మాత్రం కొదవ లేదు. ముఖ్యంగా డిటెక్టివ్‌ ప్రేమ్‌ కుమార్‌ అలియాస్‌ పీకేగా హీరో సంతోష్‌ శోభన్‌ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ప్రేమ్‌ కుమర్‌ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ ను సొంతం చేసుకుంది. శుక్రవారం (అక్టోబర్‌ 13) అర్ధరాత్రి నుంచి ప్రేమ్‌ కుమార్‌ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

ప్రేమ్‌ కుమార్‌ కథేంటంటే?

ప్రేమ్‌ కుమార్‌ సినిమాను సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. అనంత్ శ్రీకర్ స్వరాలు సమకూర్చారు. ప్రేమ్‌ కుమార్ అలియాస్ పీకే (సంతోష్ శోభ‌న్‌) ఓ వెడ్డింగ్ డిటెక్టివ్‌. తన స్నేహితుడు సుందర్‌ లింగం (కృష్ణ తేజ)తో కలిసి పెళ్లిళ్లు చెడగొడుతుంటాడు. అలాగే ప్రేమికుల్ని విడగొడుతూ డబ్బులు సంపాదిస్తుంటాడు. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంటుంది. అయితే కొన్ని కారణాలతో ఈ ప్రేమ్ కుమార్‌ పెళ్లిళ్లన్నీ పెటాకులవుతుంటాయి. మరి ఈ పీకే లైఫ్‌లోకి నేత్ర (రాశీసింగ్‌), అంగన (రుచిత సాధినేని) ఎలా వచ్చారు? వారితో పీకే పెళ్లి ఆగిపోవడానికి కారణాలేంటి? అసలు ప్రేమ్‌ కుమార్‌కు పెళ్లి అయ్యిందా?లేదా ? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం… థియేటర్లలో ప్రేమ్‌కుమార్‌ను మిస్‌ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ప్రేమ్‌ కుమార్‌ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.