AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mark Antony OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి విశాల్‌ వంద కోట్ల సినిమా.. మార్క్‌ ఆంటోనిని ఎక్కడ చూడొచ్చంటే?

కోలీవుడ్‌ యాక్షన్‌ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం 'మార్క్‌ ఆంటోని'. ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్‌ జే సూర్య సెకెండ్‌ లీడ్‌గా ఈ సినిమాలో కనిపించారు. రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా మెప్పించగా కమెడియన్‌ సునీల్, సెల్వరాఘవన్‌ వైజీ మహేంద్రన్‌, మీరా కృష్ణన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 15న థియేటర్లలో విడుదలైన మార్క్‌ ఆంటోని సూపర్‌హిట్‌గా నిలిచింది. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌కు కామెడీ టచ్‌ను ఇచ్చి..

Mark Antony OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి విశాల్‌ వంద కోట్ల సినిమా.. మార్క్‌ ఆంటోనిని ఎక్కడ చూడొచ్చంటే?
Mark Antony Movie
Basha Shek
|

Updated on: Oct 12, 2023 | 1:53 PM

Share

కోలీవుడ్‌ యాక్షన్‌ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ‘మార్క్‌ ఆంటోని’. ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్‌ జే సూర్య సెకెండ్‌ లీడ్‌గా ఈ సినిమాలో కనిపించారు. రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా మెప్పించగా కమెడియన్‌ సునీల్, సెల్వరాఘవన్‌ వైజీ మహేంద్రన్‌, మీరా కృష్ణన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 15న థియేటర్లలో విడుదలైన మార్క్‌ ఆంటోని సూపర్‌హిట్‌గా నిలిచింది. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌కు కామెడీ టచ్‌ను ఇచ్చి డైరెక్టర్‌ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అలాగే విశాల్‌ నటన, ఎస్‌ జే సూర్య కామెడీ సినిమాకు హైలెట్‌గా నిలిచింది.తమిళంతో పాటు తెలుగులోనూ మార్క్‌ ఆంటోని సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. విశాల్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఈ హీరో కెరీర్‌లో వంద కోట్ల మైలురాయిని చేరుకున్న మొదటి సినిమా మార్క్‌ ఆంటోనీనే కావడం విశేషం. థియేటర్లలో అదరగొట్టిన మార్క్‌ ఆంటోని సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ మార్క్‌ ఆంటోని డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. శుక్రవారం (అక్టోబర్‌ 13)న ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచే విశాల్‌ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.

మినీ స్టూడియో బ్యానర్‌పై ఎస్‌ వినోద్‌ కుమార్‌ మార్క్‌ ఆంటోని సినిమాను నిర్మించారు. జీవీ ప్రకాశ్‌ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో విశాల్‌ పలు డిఫరెంట్‌ గెటప్పులలో కనిపించి ఆకట్టుకున్నారు. కాగా కొన్ని రోజుల క్రితమే హిందీలోనూ మార్క్‌ ఆంటోని సినిమాను విడుదల చేశారు. అయితే ఇక్కడ సెన్సార్ కోసం లంచం ఇవ్వాల్సి వచ్చిందంటూ సెన్సార్‌ బోర్డుపై విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోషల్‌ మీడియాలో దీని గురించి పోస్ట్‌ పెట్టడం హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇలా మొత్తానికి వార్తల్లో నిలిచిన మార్క్‌ ఆంటోని సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది. మరి థియేటర్లలో మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇవాళ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..