- Telugu News Photo Gallery Cinema photos Megastar Chiranjeevi special wishes to Amitabh Bachchan on his birthday
Chiranjeevi- Amitabh: ‘హ్యాపీ బర్త్ డే గురూజీ’.. బిగ్‌బీకి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్.. ఆ ఫొటోస్ షేర్ చేస్తూ..
బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇవాళ (అక్టోబర్ 11) తన పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బిగ్‌బీ బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అమితాబ్‌కు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Updated on: Oct 11, 2023 | 1:47 PM

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇవాళ (అక్టోబర్ 11) తన పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బిగ్‌బీ బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అమితాబ్‌కు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా 'సైరా నరసింహారెడ్డి' సెట్‌లో అమితాబ్‌తో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు చిరంజీవి. ' గురూజీ.. మీకు 81వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు సంతోషం, మంచి ఆరోగ్యంతో నిండిన దీర్ఘాయువుతో ఆశీర్వదించబడాలి. మీ నటనా ప్రతిభా పాటవాలతో, అనేక సంవత్సరాల పాటు మీరు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూ ఉండాలి'

'ఈ మీ పుట్టినరోజు నాకు కూడా చాలా స్పెషల్. ఎందుకంటే మీ కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఈ రోజు రాత్రి వర్చువల్‌గా నా ఆరాధ్యదైవమైన మిమ్మల్ని కలిసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను' అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు చిరంజీవి.

ప్రస్తుతం చిరంజీవి, అమితాబ్ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మెగా అభిమానులు కూడా బిగ్ బీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా బర్త్ డే సందర్బంగా బిగ్‌బీని చూసేందుకు ముంబయిలోని ఆయన నివాసం వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. దీంతో కొద్ది సేపు బయటకు వచ్చిన ఆయన అభిమానులకు అభివాదం తెలిపారు.

అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2298 ఏడీ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే జాకీ ష్రాఫ్, కృతిసనన్‌ల గణపత్ చిత్రంలోనూ బిగ్ బీ నటిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ట డైరెక్షన్‌లో సినిమా చేయనున్నారు.





























