AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV Vyooham: రెండు పార్ట్‌లుగా సీఎం జగన్‌ బయోపిక్‌.. వ్యూహం, శపథం రిలీజ్‌ డేట్స్‌ చెప్పేసిన ఆర్జీవీ

సినిమాల మేకింగ్, రిలీజులు, ప్రమోషన్ల విషయంలో డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మది ప్రత్యేక శైలి. సక్సెస్‌, ప్లాఫ్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్‌గా సినిమాలు తెరకెక్కిస్తారాయన. ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వ్యూహం అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్‌, టీజర్స్‌ ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. తాజాగా వ్యూహం సినిమాకు సంబంధించి శపథం పేరుతో సీక్వెల్‌ కూడా అనౌన్స్‌ చేశాడు ఆర్జీవీ. అంతే కాదు వ్యూహం, శపథం సినిమాల రిలీజ్‌ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించాడు.

RGV Vyooham: రెండు పార్ట్‌లుగా సీఎం జగన్‌ బయోపిక్‌.. వ్యూహం, శపథం రిలీజ్‌ డేట్స్‌ చెప్పేసిన ఆర్జీవీ
RGV Vyooham
Basha Shek
|

Updated on: Dec 13, 2023 | 10:10 PM

Share

సినిమాల మేకింగ్, రిలీజులు, ప్రమోషన్ల విషయంలో డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మది ప్రత్యేక శైలి. సక్సెస్‌, ప్లాఫ్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్‌గా సినిమాలు తెరకెక్కిస్తారాయన. ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వ్యూహం అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్‌, టీజర్స్‌ ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. తాజాగా వ్యూహం సినిమాకు సంబంధించి శపథం పేరుతో సీక్వెల్‌ కూడా అనౌన్స్‌ చేశాడు ఆర్జీవీ. అంతే కాదు వ్యూహం, శపథం సినిమాల రిలీజ్‌ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించాడు. ‘కుట్రలకు, ఆలోచనలకు మధ్య’ అంటూ తన సినిమాలకు సంబంధించి ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వ్యూహం సినిమాను నవంబర్‌ 10న, శపథం మూవీని జనవరి 25న రిలీజ్‌ చేయనున్నట్లు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రకటించాడు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత జగన్ ఫ్యామిలీకి ఎదురైన గడ్డు పరిస్థితులు, ఓదార్పు యాత్ర, క్రిమినల్‌ కేసులు, జైలు జీవితం తదితర అంశాలను వ్యూహం సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇక గడ్డు పరిస్థితులను సీఎం జగన్‌ ఎదుర్కొన్న తీరు, ముఖ్యమంత్రిగా ఎదిగిన విధానాన్ని శపథం సినిమాలో వర్మ ఆవిష్కరించనున్నట్లు సమాచారం.

రెండు నెలల గ్యాప్ లో..

కాగా వ్యూహం, శపథం సినిమాల్లో వైఎస్‌ జగన్‌ పాత్రలో రంగం ఫేమ్‌ అజ్మల్‌ కనిపించనున్నాడు. జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి పాత్రలో మానస నటించనుంది. రామ దూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌ కుమార్‌ ఈ పొలిటికల్‌ సినిమాను నిర్మిస్తున్నారు. రిలీజుకు ముందే వ్యూహం సినిమా సంచలనం సృష్టిస్తుంది. వ్యూహం సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌, టీజర్స్‌ ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. వీటిపై స్పందించిన టీడీపీ నేతలు రామ్‌ గోపాల్‌ వర్మపై విమర్శల వర్షం గుప్పించారు. అలాగే కాంగ్రెస్‌ నేతలు కూడా ఆర్జీవీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి రిలీజుకు ముందే సంచలనాలు సృష్టిస్తోన్న వ్యూహం, శపథం సినిమాలు థియేటర్లలోకి వచ్చాక ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!