Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darsheel Safary: ఆమిర్‌ ఖాన్‌ ‘తారే జమీన్‌ పర్‌’లో నటించిన ఈ పిల్లాడు గుర్తున్నాడా? ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాక్‌ అవుతారు

దర్శీల్ సఫారీ 'తారే జమీన్ పర్' సినిమాలో నటించి బాగా ఫేమస్ అయ్యాడు . ఈ సినిమాలో నటించేటప్పటికి అతడికి పదేళ్లు కూడా నిండలేదు. ఇంత చిన్న వయసులో పేరు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. అయితే తారే జమీన్ పర్‌ సినిమాలో ఆమిర్‌తో పోటీ పడి నటించాడు దర్శిల్‌. తన అమాయక నటనతో కన్నీళ్లు తెప్పించాడు. ఈ సినిమాలో డైస్లెక్సియాతో బాధపడుతున్న ఓ పిల్లాడి పాత్రలో దర్శిల్ సఫారీ నటించాడు.

Darsheel Safary: ఆమిర్‌ ఖాన్‌ 'తారే జమీన్‌ పర్‌'లో నటించిన ఈ పిల్లాడు గుర్తున్నాడా? ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాక్‌ అవుతారు
Darsheel Safary
Follow us
Basha Shek

|

Updated on: Oct 10, 2023 | 9:06 PM

దర్శీల్ సఫారీ ‘తారే జమీన్ పర్’ సినిమాలో నటించి బాగా ఫేమస్ అయ్యాడు . ఈ సినిమాలో నటించేటప్పటికి అతడికి పదేళ్లు కూడా నిండలేదు. ఇంత చిన్న వయసులో పేరు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. అయితే తారే జమీన్ పర్‌ సినిమాలో ఆమిర్‌తో పోటీ పడి నటించాడు దర్శిల్‌. తన అమాయక నటనతో కన్నీళ్లు తెప్పించాడు. ఈ సినిమాలో డైస్లెక్సియాతో బాధపడుతున్న ఓ పిల్లాడి పాత్రలో దర్శిల్ సఫారీ నటించాడు. తమ పిల్లాడి సమస్యను అర్థం చేసుకోని తల్లిదండ్రులు వాడిని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తారు. అక్కడ ఆ పిల్లాడికి ఒక ఉపాధ్యాయుడిని (ఆమిర్ ఖాన్) కలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఎంతో ఎమోషనల్‌గా చూపించారీ సినిమాలో. ఈ మూవీలో దర్శీల్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కాగా ఈ సినిమా తర్వాత 2010లో బం బం బోలే అనే చిత్రంలో దర్శిల్‌. అలాగే 2011లో డిస్నీ జోకోమోన్ చిత్రంలో సూపర్ హీరో పాత్రను పోషించాడు. ఇలా పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు. అలాగే ‘ఝలక్ దిఖ్లాజా’ వంటి డ్యాన్స్ రియాలిటీ షోల్లో సందడి చేశాడు. అలాగే పలు షార్ట్‌ ఫిల్మ్స్‌, మ్యూజిక్‌ వీడియోలలో నటించాడు. అలాగే ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన దర్శిల్‌ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘హుకుస్ బుకస్’ ప్రమోషన్‌లో బిజీగా ఉంటున్నాడు.

అయితే 10 ఏళ్ల వయసులోనే స్టార్‌ డమ్‌ రావడంతో ఎంతో ఒత్తిడికి లోనయ్యానన్నాడు దర్శిల్. ‘ప్రస్తుతం నేను చదువులో బిజీగా ఉన్నాను. అందుకే సినిమా ఎంపికలను నేనే చూసుకుంటున్నాను. జీవితంలో ఆచితూచి అడుగు వేయాలనుకున్నాను. విద్యాభ్యాసం తర్వాత నేను విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో నేను జీవితంలో ఏం చేయాలో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ‘ 10 ఏళ్ల వయసులో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అందరూ వచ్చి అభినందనలు తెలుపుతున్నారు. ప్రజలు తనపై ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారో నాకు అర్థం కాలేదు .మా పేరెంట్స్, అమ్మమ్మ వయసులో ఉన్నవాళ్లు నా దగ్గరకు వచ్చి నాపై ఎంతో ప్రేమ చూపించేవారు. అంతా నా మనసులో నమోదైంది. కానీ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు.’ఎందుకు ఇంత హైప్‌?’ అని అప్పటి అనుభవాలను గుర్తు తెచ్చుకున్నాడు దర్శిల్‌.

ఇవి కూడా చదవండి

దర్శిల్ సఫారీ లెటెస్ట్ ఇన్ స్గా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Darsheel Safary (@dsafary)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇతను తలపై కత్తెర పెడితే మినిమం లక్ష..ఎందుకంటే..
ఇతను తలపై కత్తెర పెడితే మినిమం లక్ష..ఎందుకంటే..
ఈ లక్షణాలు కనిపిస్తే జాతకంలో బుధ స్థానం ఎలా ఉందో తెలుస్తుంది..
ఈ లక్షణాలు కనిపిస్తే జాతకంలో బుధ స్థానం ఎలా ఉందో తెలుస్తుంది..
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వీడియో
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వీడియో
7 అడుగుల గొయ్యి తీసి.. యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు..!
7 అడుగుల గొయ్యి తీసి.. యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు..!
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..