AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir Kapoor: ఇక మందు, మాంసం ముట్టనంటోన్న రణ్‌బీర్‌ కపూర్‌.. కారణమేంటో తెలిస్తే షాక్‌ అవుతారు

రామాయణం ఆధారంగా వచ్చిన ప్రభాస్‌ ఆదిపురుష్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీనికి తోడు సినిమా మేకింగ్‌పై విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ ఆలోచించకుండా ఇప్పుడు బాలీవుడ్‌లో రామాయణంపై మరో సినిమా నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నితీష్ తివారీ రామాయణాన్ని మూడు భాగాలుగా తెరపైకి తీసుకొస్తున్నారు. రాముడిగా రణబీర్ కపూర్ , సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడి పాత్రలో యశ్ నటిస్తారని తెలుస్తోంది.

Ranbir Kapoor: ఇక మందు, మాంసం ముట్టనంటోన్న రణ్‌బీర్‌ కపూర్‌.. కారణమేంటో తెలిస్తే షాక్‌ అవుతారు
Ranbir Kapoor
Basha Shek
|

Updated on: Oct 10, 2023 | 8:38 PM

Share

రామాయణం ఆధారంగా వచ్చిన ప్రభాస్‌ ఆదిపురుష్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీనికి తోడు సినిమా మేకింగ్‌పై విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ ఆలోచించకుండా ఇప్పుడు బాలీవుడ్‌లో రామాయణంపై మరో సినిమా నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నితీష్ తివారీ రామాయణాన్ని మూడు భాగాలుగా తెరపైకి తీసుకొస్తున్నారు. రాముడిగా రణబీర్ కపూర్ , సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడి పాత్రలో యశ్ నటిస్తారని తెలుస్తోంది. కాగా ఇప్పుడు రామాయణం సినిమా కోసం రణబీర్ కపూర్ తన లైఫ్‌ స్టైల్‌ను కూడా మార్చుకోవాలని అనుకుంటున్నారట. రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటించడంపై చాలా వివాదాలు తలెత్తున్నాయి. ప్రముఖ నటి కంగనా కూడా ఈ విషయంపై విమర్శలు గుప్పించింది. దీంతో ఈ విషయాన్ని రణబీర్ కపూర్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాముడి పాత్రలో నటించేందుకు మాంసాహారం, మద్యం మానేసినట్లు తెలుస్తోంది. రామాయణం షూటింగ్ పూర్తయ్యే వరకు ఇలాగే ఉండనున్నాడని బాలీవుడ్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం నడుస్తోంది.

అయితే రణబీర్ కపూర్ నిజంగా మారుతున్నాడా లేక ఇది పబ్లిసిటీ స్టంటా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత రణబీర్ ఆల్కహాల్ పూర్తిగా మానేస్తాడని, మాంసాన్ని కూడా ముట్టుకోడని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కాదు. తమను తాము పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా రణబీర్ కపూర్ ‘యానిమల్’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ కపూర్, రష్మిక మందన్న తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నాడు. ‘యానిమల్‌’ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఆగస్ట్ 11న అన్ని భాషల్లో పాటల్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 1న ‘యానిమల్’ సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్ , రష్మిక

యానిమల్ సినిమా టీజర్..

యానిమల్ సినిమాలో రష్మిక..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి