AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ముఖం చూపించకుండా దోబూచులాడుతోన్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? ప్రభాస్‌ సినిమాలో నటించిందండోయ్‌..

పై ఫొటోలో ముఖం చూపించకుండా దోబూచులాడుతోన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? ఈ హీరోయిన్‌ తెలుగు, హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించింది. అయితే ఎక్కువగా గ్లామర్‌ రోల్స్‌లోనే సందడి చేసింది. కొన్ని సినిమాల్లో సెకెండ్‌ హీరోయిన్‌గా చేసింది. అలాగే మరికొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో మెప్పించింది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఈ బ్యూటీ సక్సెస్‌ రేటు చాలా ఎక్కువ. ఆమె నటించిన వాటిల్లో చాలా సినిమాలు హిట్‌ అయ్యాయి.

Actress: ముఖం చూపించకుండా దోబూచులాడుతోన్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? ప్రభాస్‌ సినిమాలో నటించిందండోయ్‌..
Tollywood Actress
Basha Shek
|

Updated on: Oct 08, 2023 | 8:00 AM

Share

పై ఫొటోలో ముఖం చూపించకుండా దోబూచులాడుతోన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? ఈ హీరోయిన్‌ తెలుగు, హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించింది. అయితే ఎక్కువగా గ్లామర్‌ రోల్స్‌లోనే సందడి చేసింది. కొన్ని సినిమాల్లో సెకెండ్‌ హీరోయిన్‌గా చేసింది. అలాగే మరికొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో మెప్పించింది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఈ బ్యూటీ సక్సెస్‌ రేటు చాలా ఎక్కువ. ఆమె నటించిన వాటిల్లో చాలా సినిమాలు హిట్‌ అయ్యాయి. తెలుగులో కల్యాణ్‌రామ్, రామ్‌, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ లాంటి స్టార్స్‌తో ఆడిపాడింది. దీనికి తోడు తన గ్లామర్‌ ఇమేజ్‌తో సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ సొంతం చేసుకుందీ సొగసరి. కొన్ని నెలల క్రితం ఓ పాన్‌ ఇండియా సినిమాలోనూ మెరిసింది. ప్రస్తుతం సినిమాల కంటే సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోన్న ఈ అందాల తారను కనిపెట్టారా? కష్టంగా ఉందా అయితే ఓ క్లూ.. ప్రభాస్‌ చివరిగా నటించిన ఆదిపురుష్‌ సినిమాలో ఓ స్పెషల్ రోల్‌ పోషించింది. రావణుడిగా నటించిన సైఫ్‌ అలీఖాన్‌ భార్య మండోదరి పాత్రలో మెరిసింది. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? ఈ ముద్దుగుమ్మ మరెవరో యస్‌. ఆమెనే సోనాల్ చౌహాన్‌.

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన సోనాల్ చౌహాన్‌ జన్నత్‌ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రెయిన్‌ బో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత బాలయ్యతో లెజెండ్‌, డిక్టేటర్‌, రూలర్‌, రామ్‌తో పండగ చేస్కో, కల్యాణ్‌ రామ్‌తో షేర్‌, సైజ్‌ జీరో, వరుణ్‌ తేజ్‌, వెంకటేష్‌లతో ఎఫ్‌ 3, నాగార్జునతో ఘోస్ట్‌ తదితర సినిమాల్లో నటించింది. అయితే వీటిలో ఎక్కువగా గ్లామర్‌ రోల్స్‌లోనే కనిపించిందీ అందాల తార. ఇక ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌లో మండోదరిగా మొదటిసారిగా హోమ్లీ లుక్‌లో కనిపించింది సోనాల్‌. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్‌ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

సోనాల్ చౌహాన్‌ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్ ..

సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోన్న సోనాల్..

గ్లామరస్ ఫొటోలతో నెట్టింట రచ్చ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!