AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor: గోల్కొండ హైస్కూల్‌లో నటించిన ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌ హీరో.. కామెడీ ఇరగదీస్తున్నాడు

స్కూల్‌ క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన గోల్కొండ హైస్కూల్‌ సినిమాలో చాలామంది కుర్రాళ్లు నటించారు. అందులో పైన కనిపించే అబ్బాయి కూడా ఒకడు. ఇందులో వరుణ్‌ అనే పాత్రలో ఎంతో బొద్దుగా కనిపించిన ఈ కుర్రాడు ఇప్పుడు హ్యాండ్సమ్‌ హీరోగా మారిపోయాడు. తనదైన నటనతో ఇరగదీస్తున్నాడు. ముఖ్యంగా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా?

Actor: గోల్కొండ హైస్కూల్‌లో నటించిన ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌ హీరో.. కామెడీ ఇరగదీస్తున్నాడు
Child Artist In Golconda High School
Follow us
Basha Shek

|

Updated on: Oct 07, 2023 | 6:20 AM

2011లో విడుదలైన గోల్కొండ హైస్కూల్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ఈ ఫీల్‌ గుడ్‌ మూవీలో సుమంత్‌, స్వాతి జంటగా నటించారు. ప్రస్తుం టాలీవుడ్‌ హీరోగా రాణిస్తోన్న సంతోష్‌ శోభన్‌ ఈ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా స్కూల్‌ క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన గోల్కొండ హైస్కూల్‌ సినిమాలో చాలామంది కుర్రాళ్లు నటించారు. అందులో పైన కనిపించే అబ్బాయి కూడా ఒకడు. ఇందులో వరుణ్‌ అనే పాత్రలో ఎంతో బొద్దుగా కనిపించిన ఈ కుర్రాడు ఇప్పుడు హ్యాండ్సమ్‌ హీరోగా మారిపోయాడు. తనదైన నటనతో ఇరగదీస్తున్నాడు. ముఖ్యంగా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? మ్యాడ్‌ సినిమాలో పొట్టచెక్కలయ్యేలా ఆడియెన్స్‌ను నవ్వించిన సంగీత్‌ శోభన్‌. అదేనండి యంగ్ హీరో సంతోష్‌ శోభన్‌ తమ్ముడు. ఈ సినిమా కంటే ముందు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించాడు. అందులో తన కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పుడు డైరెక్టుగా మ్యాడ్‌ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పై దర్శనమిచ్చాడు. ఇందులో సంగీత్‌ శోభన్‌ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. ఇదే కంటిన్యూ చేస్తే టాలీవుడ్‌కు మరో జాతిరత్నం దొరికనట్టేనంటూ కామెంట్లు వస్తున్నాయి.

ప్రభాస్‌తో వర్షం లాంటి సూపర్‌ హిట్ తీసిన డైరెక్టర్‌ శోభన్‌ సంగీత్‌ నాన్న. దీంతో సహజంగానే ఇతనికి కూడా సినిమాలపై ఆసక్తి కలిగింది. అలా 2011లో గోల్కొండ హైస్కూల్‌లో అన్న సంతోష్‌ శోభన్‌ కీ రోల్‌ పోషిస్తే.. ఛైల్డ్‌ ఆర్టిస్టుగా సంగీత్‌ శోభన్‌ నటించాడు. మూడేళ్ల క్రితమే ‘ద బేకర్ అండ్ ద బ్యూటీ’ అనే వెబ్ సిరీస్‌లో ఓ స్పెషల్‌ రోల్‌ చేశాడు. అలాగే త్రీ రోజెస్, పిట్ట కథలు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సిరీస్‌లతోనూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మ్యాడ్ సినిమాలో దామోదర్ (డీడీ) అనే బీటెక్‌ కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. త్వరలోనే ప్రేమ విమానం అనే సినిమాతో మనల్ని పలకరించేందుకు రెడీ అయ్యాడీ యంగ్ హీరో.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ తో సంగీత్  శోభన్..

మ్యాడ్ సినిమా ప్రమోషన్లలో హీరో సంగీత్ శోభన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.