AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ‘ఆ బర్రె పిల్లకు నేనేం అన్యాయం చేశాను’ రతికను మర్చిపోలేకపోతున్న రైతు బిడ్డ

బిగ్‏బాస్ ఇంట్లో ప్రతి సీజన్ లో ఉండే లవ్ ట్రాక్స్ ఏడో సీజన్‌లోనూ నడిచాయి. ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, రతికా రోజ్‌ ల జోడీ బిగ్‌బాస్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కామన్‌ మ్యాన్‌గా ఎంతో సింపుల్‌గా ఉండే రైతుబిడ్డతో రతికతో ఎంతో క్లోజ్‌గా ఉండడం జనాలకు తెగ నచ్చేసింది. అయితే ఆటలో భాగమేనని కొద్ది రోజులకే అర్థమైపోయింది. తనతో ఎంతో క్లోజ్‌గా ఉన్న పల్లవి ప్రశాంత్‌కు వెన్నుపోటు పొడిచింది రైతు బిడ్డ. తనను నామినేట్‌ చేయడంతో పాటు చెడా మడా తిట్టేసింది.

Bigg Boss 7 Telugu: 'ఆ బర్రె పిల్లకు నేనేం అన్యాయం చేశాను' రతికను మర్చిపోలేకపోతున్న రైతు బిడ్డ
Pallavi Prashanth, Rathika
Basha Shek
|

Updated on: Oct 05, 2023 | 6:41 AM

Share

బిగ్‏బాస్ ఇంట్లో ప్రతి సీజన్ లో ఉండే లవ్ ట్రాక్స్ ఏడో సీజన్‌లోనూ నడిచాయి. ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, రతికా రోజ్‌ ల జోడీ బిగ్‌బాస్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కామన్‌ మ్యాన్‌గా ఎంతో సింపుల్‌గా ఉండే రైతుబిడ్డతో రతికతో ఎంతో క్లోజ్‌గా ఉండడం జనాలకు తెగ నచ్చేసింది. అయితే ఆటలో భాగమేనని కొద్ది రోజులకే అర్థమైపోయింది. తనతో ఎంతో క్లోజ్‌గా ఉన్న పల్లవి ప్రశాంత్‌కు వెన్నుపోటు పొడిచింది రైతు బిడ్డ. తనను నామినేట్‌ చేయడంతో పాటు చెడా మడా తిట్టేసింది. గొడవలకు కూడా దిగింది. ఇదే సమయంలో ప్రిన్స్‌ యావర్‌పై ప్రేమను ఒలకబోసింది. అయితే అది కూడా కొన్ని రోజులే సాగింది. అయితే హౌజ్‌లో ఎలా ఉన్నా బిగ్‌ బాస్‌షో ఏడో సీజన్‌కు గ్లామర్‌ లుక్‌ తెచ్చింది రతికనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకానొక దశలో టైటిల్‌ ఫేవరెట్‌గా ఆమెను భావించారు. అయితే తన ఆటతీరు, ప్రవర్తనతో నాలుగో వారంలోనే హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంటూ హౌజ్‌ను వీడింది. అయితే బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి రతిక బయటకు వెళ్లిపోయినా ఆమెను మర్చిపోలేకపోతున్నాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌. తరచూ రతిక గుర్తుకొస్తుందంటూ తన ఆవేదనను శివాజీ ముందు వెళ్లబోసుకున్నాడు.

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో రతిక గురించి ప్రశాంత్, శివాజీల మధ్య సంభాషణ నడిచిందిలా..

  • పల్లవి ప్రశాంత్‌: అన్నా.. నీకు రతిక గుర్తుకు వస్తుందా? నాకు రాత్రి తెగ గుర్తుకు వచ్చింది అన్నా.. అసలు నిద్ర పట్టలేదు.
  • శివాజీ: నాకు గుర్తుకు వచ్చింది కానీ ఏమ్‌ చేస్తామ్‌ రా? అది చిన్న పిల్ల..
  • ప్రశాంత్: అది చిన్న పిల్ల ఏంది అన్నా.. బర్రె పిల్ల. మస్తు కోపం వచ్చింది
  • శివాజీ: బయటకు వెళ్లాక కలుద్దాం లేదరా.. నువ్వు బాధ పడకు.. నాకు అర్థం అయ్యింది నీ ఆవేదన
  • ప్రశాంత్: రెండు మేకపోతులు తినిపించి చంపేస్తా అన్నా దానిని.. నా మీద ఎందుకు అన్నా అంత కోపం.. నేను ఏం తప్పు చేశాను? నన్ను నామినేట్‌ చేసినా కూడా మన అమ్మాయే కదా అని మాట్లాడినా.. అయినా నన్ను నమ్మలేదు తను..
  • శివాజీ: చిన్న పిల్లరా అది వదిలేయ్‌..
  • ప్రశాంత్: నన్ను కలవదు అన్నా రతిక.. బయటకు పోయాక..
ఇవి కూడా చదవండి

కాగా ఈ సంభాషణ గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింద రతిక. తాను కూడా పల్లవి ప్రశాంత్, శివాజీలను మిస్‌ అవుతున్నానంటూ తెలిపింది.

రతికా రోజ్ ఇన్ స్టా గ్రామ్  స్టోరీస్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌