Guess The Actress: ఈ టాలీవుడ్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? స్టార్స్‌తో సినిమాలు, యాడ్స్‌ చేసిందండోయ్‌..

మత్తెక్కించే కళ్లు, చూపు తిప్పుకోనివ్వని అందంతో మైమరిపిస్తోన్న ఈ టాలీవుడ్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఒక బ్లాక్ బస్టర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అందులో సెకెండ్‌ హీరోయిన్‌ అయినా తన క్యూట్‌ యాక్టింగ్‌తో అందరినీ కట్టిపడేసింది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ్ల సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అంతకుముందు మోడలింగ్‌తో కెరీర్‌ ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌, మహేంద్ర సింగ్‌ ధోనిలతో యాడ్స్‌ చేసింది.

Guess The Actress: ఈ టాలీవుడ్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? స్టార్స్‌తో సినిమాలు, యాడ్స్‌ చేసిందండోయ్‌..
Tollywood Actress
Follow us

|

Updated on: Oct 04, 2023 | 6:20 AM

మత్తెక్కించే కళ్లు, చూపు తిప్పుకోనివ్వని అందంతో మైమరిపిస్తోన్న ఈ టాలీవుడ్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఒక బ్లాక్ బస్టర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అందులో సెకెండ్‌ హీరోయిన్‌ అయినా తన క్యూట్‌ యాక్టింగ్‌తో అందరినీ కట్టిపడేసింది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ్ల సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అంతకుముందు మోడలింగ్‌తో కెరీర్‌ ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌, మహేంద్ర సింగ్‌ ధోనిలతో యాడ్స్‌ చేసింది. సినిమాల్లో ఎక్కువగా అల్లరి పిల్లగా కనిపించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సిల్వర్‌ స్క్రీన్‌పై పెద్దగా కనిపించలేదు. ఇటీవలే ఓటీటీ సినిమాలు, సిరీస్‌లలో దర్శనమిస్తోంది. అదే విధంగా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా మారింది. గ్లామర్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేస్తోంది. మరి పై ఫొటోలో గ్లామరస్‌గా కనిపిస్తోన్న బ్యూటీని గుర్తుపట్టారా? లేదా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? ఆమె మరెవరో కాదు.. రంగం సినిమాలో అల్లరి పిల్లగా కనిపించిన పియా బాజ్‌పాయ్. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేసుకోగా అవి కాస్తా వైరల్‌గా మారాయి. అయితే చాలామంది వీటిని చూసి తనను గుర్తుపట్టలేకపోయారు. అయితే చివరికి ఇందులో ఉన్నది రంగం హీరోయినా? అని తెలుసుకుని ముక్కున వేలేసుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఎతావాలో పుట్టి పెరిగిన పియా బాజ్‌పాయ్ ఢిల్లీలోనే సెటిలైంది. ఆతర్వాత ముంబైకి వచ్చి మోడలింగ్‌ ప్రారంభించింది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని లాంటి స్టార్స్‌తో యాడ్స్‌ చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2008లో ‘పోయ్ సొల్ల పోరమ్’ అనే ఓ తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. నిన్ను కలిశాక అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. అయితే రంగం సినిమాతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నవీన్‌ చంద్రతో కలిసి దళం అనే ఓ డిఫరెంట్ జానర్‌ మూవీలో నటించింది. బ్యాక్‌బెంచ్‌ లాంట్‌ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీస్లో నటించినా విజయాలు మాత్రం దక్కించుకోలేకపోయింది. 2018 తర్వాత పెద్దగా సినిమాలేవీ చేయలేదు పియా బాజ్‌ పాయ్‌. అయితే ఇటీవల లాస్ట్‌ అనే ఓ సినిమాలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

పియా బాజ్ పాయ్ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Pia Bajpiee (@piabajpai)

ఓటీటీల్లో కనిపిస్తోన్న పియా బాజ్ పాయ్

View this post on Instagram

A post shared by Pia Bajpiee (@piabajpai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.