AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: సల్లూ భాయ్‌కు ఏమైంది? సూపర్‌స్టార్‌ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌ లో ఆందోళన.. ఈ వీడియోనే కారణం

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్ ఖాన్ నటించిన ' టైగర్ 3 ' విడుదలకు సిద్ధంగా ఉంది. టైగర్ సిరీస్‌లో భాగంగా వస్తోన్న ఈ మూడో సీక్వెల్‌ దీపావళికి విడుదలవుతోంది. కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Salman Khan: సల్లూ భాయ్‌కు ఏమైంది? సూపర్‌స్టార్‌ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌ లో ఆందోళన.. ఈ వీడియోనే కారణం
Salman Khan
Basha Shek
|

Updated on: Oct 03, 2023 | 7:30 AM

Share

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్ ఖాన్ నటించిన ‘ టైగర్ 3 ‘ విడుదలకు సిద్ధంగా ఉంది. టైగర్ సిరీస్‌లో భాగంగా వస్తోన్న ఈ మూడో సీక్వెల్‌ దీపావళికి విడుదలవుతోంది. కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్ తాజాగా ఓ వివాహ కార్యక్రమంలో సందడి చేశాడు. డ్యాన్స్‌ చేసి ఆహూతులను అలరించాడు. అయితే ఈ సమయంలో సల్లూ భాయ్ బాగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. బాగా అలసిపోయినట్లు అనిపించింది. సాధారణంగా ఇలాంటి ప్రోగ్సామ్స్‌లో ఫుల్‌ జోష్‌లో డ్యాన్స్‌ చేస్తాడు సల్మాన్‌. కానీ ఈ వెడ్డింగ్ ఈవెంట్‌లో పూర్తి నీరసంగా కనిపించాడు సల్లూ భాయ్‌. హమ్కా పీనీ హై అనే పాటకు కాలు కదిపిన ఆయన స్టెప్పులేసేందుకు చాలా కష్టపడ్డాడు. దీంతో ఈ స్టార్‌ హీరోకు చాలా విశ్రాంతి అవసరమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సల్మాన్ ఖాన్ తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. టైగర్ 3 సినిమా విడుదలైన తర్వాత విరామం తీసుకోవాలని అభ్యర్థించారు.

కాగా సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన టైగర్‌ 3 సినిమా ప్రమోషన్‌ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. దీంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. దీంతో ఆయనకు సరైన విశ్రాంతి లభించడం లేదు. టైగర్ 3ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో షారూఖ్ అతిథి పాత్రలో కనిపించాడని వార్తలు వస్తున్నాయి. మనీష్ శర్మ తెరకెక్కించిన ఈ స్టైలిష్‌ యాక్షన్‌ మూవీలో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించారు. ఇటీవలే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా ‘టైగర్ 3’ ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాలకు సీక్వెల్. ఈ సినిమా కథ ఏంటనేది ఈ టీజర్‌లో వివరించారు సల్మాన్‌. ‘నేను భారతదేశం కోసం 20 సంవత్సరాలు పనిచేశాను. కానీ నేను ప్రతిఫలంగా ఏమీ వినలేదు. ఈరోజు వింటున్నాను. టైగర్‌ శత్రువు, దేశద్రోహి అని అంటున్నారు. 20 ఏళ్ల సర్వీసు తర్వాత కూడా ఇండియా నుంచి క్యారెక్టర్ సర్టిఫికెట్ అడుగుతున్నారు’ అంటూ సల్మాన్ ఖాన్ చెప్పిన డైలాగ్ హైలైట్‌ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us