The Vaccine War: గాంధీ జయంతి స్పెషల్ ఆఫర్.. ఒక మూవీ టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. పూర్తి వివరాలివే
సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా డిసెంట్ టాక్ తెచ్చుకుంది. ది కశ్మీర్ ఫైల్స్ అంతా సంచలన కలెక్షన్లు రాకపోయినా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లనే రాబడుతోంది. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.25 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కాగా రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ది వ్యాక్సిన్ వార్ వసూళ్లలో కాస్త వెనకబడింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్లు లేవు. ప్రమోషన్లు లేకపోవడం దీనికి ఒక కారణమని చెప్పకపోవచ్చు.
గతేడాది ‘ది కశ్మీర్ ఫైల్స్’ అంటూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండిట్ల ఊచకోతను ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా 200 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు చేసింది. అదే సమయంలో వివాదాలతోనూ వార్తల్లో నిలిచింది. తన కెరీర్‌లో ఎక్కువగా నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకునే సినిమాలు రూపొందిస్తున్నాడీ స్టార్ డైరెక్టర్. ఇప్పుడు కూడా ‘ది వ్యాక్సిన్ వార్’ అంటూ కరోనా నాటి పరిస్థితులను సిల్వర్ స్క్రీన్‌పై చూపించే ప్రయత్నం చేశాడు. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా డిసెంట్ టాక్ తెచ్చుకుంది. ది కశ్మీర్ ఫైల్స్ అంతా సంచలన కలెక్షన్లు రాకపోయినా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లనే రాబడుతోంది. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.25 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కాగా రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ది వ్యాక్సిన్ వార్ వసూళ్లలో కాస్త వెనకబడింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్లు లేవు. ప్రమోషన్లు లేకపోవడం దీనికి ఒక కారణమని చెప్పకపోవచ్చు. ఈక్రమంలో సినీ ప్రియులకు ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్ర బృందం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఉచితమని తెలిపింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం (అక్టోబర్ 2) మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. బుక్ మై షో, పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ వెబ్‌సైట్లు/ ఆన్‌లైన్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సినిమా ప్రియులను కోరింది. ‘గాంధీ జయంతి రోజు మీ కుటుంబంతో కలిసి ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రాన్ని చూడండి. ఈరోజు ఒక్క టికెట్ కొంటే మీకు ఒక టికెట్ ఫ్రీ. ఆ టికెట్ మీ ఇంట్లో పనిమనిషికి లేదా వేరొకరికి ఇవ్వండి. మీరు సంతోషించడంతో పాటు ఇతరులకు కూడా ఆనందాన్ని పంచిన వారవుతారు. ‘నా సినిమా చూసి ఒక్క అమ్మాయైనా స్ఫూర్తి పొంది వైరాలజిస్ట్‌గా మారితే అది ‘ది వ్యాక్సిన్ వార్’ కు దక్కిన విజయంగా భావిస్తా. అప్పుడు నా చిత్రం పూర్తి విజయం సాధించినట్లు’ అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.
‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాలో కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ సైంటిస్ట్ పాత్రలో మెరిసింది. ఆమెతో పాటు నానా పటేకర్, పల్లవి జోషి, రైమాసేన్, అనుపమ్ ఖేర్, నివేదిత భట్టాచార్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొద్ది రోజుల క్రితం షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రానికి కూడా ఇలాంటి ఆఫర్ వచ్చింది. ‘జవాన్’ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత, ఒక టికెట్ కొనండి ఒక ఉచిత టికెట్ అని ప్రకటించారు. ‘జవాన్’ సినిమాకు ఈ ప్లాన్ బాగా వర్కవుట్ అయింది. బై వన్ గెట్ వన్ ఆఫర్‌లో ‘జవాన్’ సినిమాను చాలా మంది చూశారు. ఇప్పుడు అదే ఆఫర్‌ను ‘ది వ్యాక్సిన్ వార్’ టీమ్ విడుదల చేసింది, అయితే ఇది వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.’ది వ్యాక్సిన్ వార్’ చిత్రం భారత్‌లో వ్యాక్సిన్ తయారీ కథాంశంతో తెరకెక్కింది. టీకా తయారీలో భారతీయ శాస్త్రవేత్తల బృందం చాలా ఎలా కష్టపడాల్సి వచ్చింది? వ్యాక్సిన్ అభివృద్ధిలో భారతీయ మహిళా శాస్త్రవేత్తలు పోషించిన పాత్ర ఏమిటి? వ్యాక్సిన్ తయారీలో విలన్‌గా ఎవరు వ్యవహరించారు? అనే అంశాలను ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.
గాంధీ జయంతి రోజున స్పెషల్ ఆఫర్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.