AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumari Srimathi OTT: ఓటీటీలో నిత్యా మేనన్‌ ‘కుమారి శ్రీమతి’ కి సూపర్‌ రెస్పాన్స్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

ప్రముఖ హీరోయిన్ నిత్యామేనన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ 'కుమారి శ్రీమతి'. గోమఠేష్ ఉపాధ్యాయ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ సిరీస్‌లో కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్‌ పరిటాల, వీకే నరేష్‌, గౌతమి, తిరువీర్, తాళ్లూరి రామేశ్వర్, ప్రణీత పట్నాయక్‌, ప్రేమ్‌ సాగర్‌, నరేష్‌, మురళీ మోహన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. . న్యాచురల్ స్టార్ నాని, అవసరాల శ్రీనివాస్‌ స్పెషల్‌ రోల్స్‌లో సందడి చేశారు.

Kumari Srimathi OTT: ఓటీటీలో నిత్యా మేనన్‌ 'కుమారి శ్రీమతి' కి సూపర్‌ రెస్పాన్స్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
Kumari Srimathi Web Series
Basha Shek
|

Updated on: Sep 30, 2023 | 11:18 AM

Share

ప్రముఖ హీరోయిన్ నిత్యామేనన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’. గోమఠేష్ ఉపాధ్యాయ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ సిరీస్‌లో కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్‌ పరిటాల, వీకే నరేష్‌, గౌతమి, తిరువీర్, తాళ్లూరి రామేశ్వర్, ప్రణీత పట్నాయక్‌, ప్రేమ్‌ సాగర్‌, నరేష్‌, మురళీ మోహన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. న్యాచురల్ స్టార్ నాని, అవసరాల శ్రీనివాస్‌ స్పెషల్‌ రోల్స్‌లో సందడి చేశారు. టీజర్లు, పోస్టర్స్‌, ట్రైలర్‌తో ఆసక్తిని రేకెత్తించిన కుమారి శ్రీమతి వెబ్ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ గురువారం (సెప్టెంబర్‌ 28) నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆద్యంతం ఆకట్టుకునే కథ కథనాలు, కామెడీ, యాక్షన్, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఎప్పటిలాగే తన నటనతో కట్టిపడేసింది నిత్య. ప్రస్తుతం కుమారి శ్రీమతి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో లో ఇండియా లోని టాప్ షోస్ లో నంబర్‌ వన్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా తమ సిరీస్‌ను ఆదరిస్తోన్న ఆడియెన్స్‌కు కుమారి శ్రీమతి టీమ్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. కుమారి శ్రీమతి వెబ్‌ సిరీస్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.

స్పెషల్‌ రోల్‌ లో న్యాచురల్‌ స్టార్‌ నాని

కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. తాత కట్టించిన ఇంటిని దక్కించుకోవడానికి తాపత్రయ పడుతూ ఉంటుంది సిరి అలియాస్‌ శ్రీమతి ( నిత్యా మేనన్‌). ఇందుకోసం బాబాయితో న్యాయస్థానంలో పోరాటం చేస్తుంది. అయితే 38 లక్షలు కడితనే ఇల్లు దక్కుతుందని కోర్టు ఆదేశించడంతో బార్‌ను ఓపెన్‌ చేస్తుంది. మరి ఓ మహిళ బార్‌ను ఎలా నిర్వహించింది? ఈ ప్రయాణంలో ఆమెకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? నిరూపమ్‌, నాని, అవసరాల శ్రీనివాస్‌ పాత్రలేంటో తెలుసుకోవాలంటే కుమారి శ్రీమతి వెబ్‌ సిరీస్‌ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

టాప్ లో ట్రెండ్ అవుతోన్న కుమారి శ్రీమతి..

ఒక మహిళ బార్ పెడితే ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..